ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 26 July 2013

    టెన్షన్ లో పవన్ కళ్యాణ్

    Pawan Kalyan in Tension
    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ‘అత్తారింటికి దారేది’ సినిమాకు వచ్చినంత మీడియా హైక్ మరే సినిమాకు రాలేదు. దీనికి ప్రధాన కారణం పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్, ఒక కారణం అయితే మరో కారణం రామ్ చరణ్ ‘ఎవడు’ తో పోటీగా రావడం. ఈ సినిమాలో క్లైమేక్స్ సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయని ఆ సన్ని వేసాలలో పవన్ అద్భుతంగా నటించాడని ప్రచారం జరుగుతోంది. పంచ్ డైలాగ్స్ చెప్పడంలో మంచి టైమింగ్ ఉన్న పవన్ ఉదాత్త సన్నివేశాలలో బాగా నటించగలడా అంటూ అప్పుడే సినిమా విడుదల కాకుండ కామెంట్స్ కూడా వచ్చేస్తున్నాయి.

    క్రితం సంవత్సరం పవన్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా విడుదలకు ముందు కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. ఆ సినిమాలో ప్రీ క్లైమేక్స్ సన్నివేశాలు అదుర్స్ అనీ పవన్ నటనకు ప్రేక్షకుల వెంట్రుకలు నిక్కపోడుచుకుంటాయనీ ఆసినిమా దర్శకుడు పూరిజగాన్నాద్ జనాన్ని ఊదరగొట్టేసాడు, చివరకు ఆ సినిమాలో ఆసన్నివేసాలన్నీ తేలిపోయాయి. పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో చెప్పిన డైలాగ్స్ ఆ సినిమాను నిలబెట్ట లేకపోయింది. ప్రస్తుతం అదే ప్రచారం మళ్ళీ మొదలై ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ నటనకు ప్రేక్షకులు మెస్మరైజ్ అవడమే కాకుండా ఏకంగా పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా ద్వారా నంది అవార్డు వస్తుందని ప్రచారం మొదలైపోయింది. మీడియాలో వస్తున్న లీక్ ల బట్టీ చూస్తే ఈ సినిమా కధ మామూలు రొటీన్ కధ మాత్రమే. ఇటువంటి కధకు త్రివిక్రమ్ ఇచ్చిన తనదైన ట్రీట్మెంట్ పవన్ మేనేరిజంతో కూడిన పంచ్ డైలాగ్స్ సమంత క్యూట్ లుక్స్ మాత్రమే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలు.

     ఇటువంటి పరిస్థుతులలో ఈ సినిమా పట్ల రోజురోజుకు పెరిగిపోతున్న అంచనాల నేపధ్యంలో నంది అవార్డు మాట అటుంచి ఈసినిమా హిట్ కావడం పవన్ కెరియర్ రీత్యా చాలా అవసరం. రోజురోజుకీ అభిమానులలో పెరిగిపోతున్న ఈ సినిమా పట్ల అంచనాలు చూసి ఎమోవుతుందో అని పవన్ కూడా టెన్షన్ లో ఉన్నాడట.....

    Post Comments

    Tollywood

    Bollywood

    Kollywood