ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 25 July 2013

    పెళ్లికింకా టైముంది... కంగారు పడకండి

    Hansika, Simbu, Marriage, Hansika Weds Simbu
    శింబుతో లవ్‌ అఫైర్‌ ఉందని ఓపెన్‌గా చెప్పేసిన హన్సిక తన పెళ్లికి మాత్రం ఇంకా చాలా టైమ్‌ ఉందని అంటోంది. పెళ్లి గురించి అస్సలు ఆలోచించడం లేదని, అది చాలా ఏళ్ల తర్వాత మాట్లాడుకోవాల్సిన సంగతి అని హన్సిక ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మరి శింబుతో లవ్‌లో ఉన్న సంగతి ఎందుకు ఇప్పుడే చెప్పేశారని అడిగితే, తన గురించి పుకార్లు తరచుగా వినిపిస్తున్నాయని, అదే పనిగా తమ ఇద్దరి గురించి రాస్తూ... ఏదో ఉంది అంటూ ఆరాలు తీస్తోంటే వాటిని చదువుతూ కూర్చోలేక అసలు విషయం చెప్పేశానని చెప్పింది.

    ఇకనైనా తన ప్రైవేట్‌ లైఫ్‌ గురించి చెత్త రాతలు మానేస్తారని ఆశిస్తున్నానని అంటోంది. తన కెరీర్‌ ఇప్పుడు చాలా బూమ్‌లో ఉందని, ఇలాంటి టైమ్‌లో పెళ్లి చేసుకుని వెళ్లే ఆలోచన లేదని తేల్చేసింది. అయితే శింబు నుంచి మాత్రం మరోలా వినిపిస్తోంది. అతను పెళ్లికి తొందర పడుతున్నట్టు అనిపిస్తోంది. పైగా అతని తండ్రి కూడా పెళ్లి వచ్చే ఏడాదిలోనే ఉంటుందని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. శింబు తండ్రి కోరిక నెరవేరుతుందో, లేక ఇప్పట్లో పెళ్లి వద్దనే హన్సిక పంతమే గెలుస్తుందో చూడాలి మరి.

    Tollywood

    Bollywood

    Kollywood