ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 12 July 2013

    ఇక ఆంబోతు..లాటసాగేరా..!

    Udaya Bhanu Song | Udhaya Bhanu Telangana Song
    ప్రస్తుతం రాష్ట్రం లో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణా బిడ్డ ఉదయభాను స్వయంగా రాసి పాడిన ఈ పాట తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది..

    రాష్ట్రం లో ప్రస్తుతం నెలకొన్న పరిస్తితులపై సినీ నటి ఉదయభాను తన తల్లితో కలిసి రాసిన పాట రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.గ్లామర్ తారగానే ఇప్పటివరకు తెలిసిన ఉదయభానులో ఇంత సామాజిక స్పృహ ఉందా ..అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.మాటీవీ రేలారే రేలా కార్యక్రమం సందర్భంగా తన గుండెలోని బాధనూ,ఆవేదననూ బయటపెట్టిన తీరు చూసి అదే వేదికపై ఉన్న తెలంగాణా రచయితలైన వందేమాతరం శ్రీనివాస్,గోరటి వెంకన్న లు సైతం మొదట కొద్దిసేపు ఇది కలో నిజమో అని అర్థం కాక బిత్తర చూపులు చూసినట్టు వారి ముఖ కవళికల ద్వారా స్పష్టంగా తెలుస్తూనే ఉంది.వీరిద్దరూ,వీరితోపాటూ తమ్మారెడ్డి భరద్వాజ సైతం వేదిక దిగి ఉదయభానుకు సల్యూట్ చేసిన తీరు చూస్తుంటే,ఎప్పటినుంచో గుండెల్ని పిండేసే బాధ ఉన్నా బయట పడక ఇన్నాళ్ళూ వీళ్ళంతా మౌనం వహించారని అర్థమౌతూనే ఉంది. తెలంగాణా ముద్దుబిడ్డ ఐన ఉదయభాను తండ్రి ప్రముఖ కవిగా అందరికీ సుపరిచితుడే.

    ఇకపోతే  ప్రస్తుత పరిణామాలపై ఆవేదన చెంది ఆమె ఈ పాట రాసినట్లు తెలుస్తోంది. రెండు పూటల కూడా తిండిలేక ఎంతోమంది ఒక వైపు అలమటిస్తుంటే ..
    “గద్దె కోసం గాడిద ..కొడుకులు..”అంటూ ఆమె తన ఆవేదనను,ఆగ్రహాన్ని పాట రూపం లో పంచుకున్న తీరు ఎన్నో హృదయాలను ఆలోచింపజేస్తోంది.

    “రావనాసురులంతా చేరీ..రోజుకొక్కా రచ్చబెడితే..”
    …………………….
    “ఇక ఆంబోతు..లాటసాగేరా..!…

    ఈ పాట కొందరినైనా ఆలోచింపజేస్తుందని చివరలో ఆమె బరువెక్కిన హృదయం తో చెబుతున్నప్పుడు చాలా మంది కళ్ళ నీళ్ళు ఆపుకోలేకపోయారట.

    Tollywood

    Bollywood

    Kollywood