తెలంగాణపై కాంగ్రెస్ ఏదో ఒక డెసిషన్ తీసేసుకోవడం ఖాయమనుకొన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టడమో... కలిసి ఉంచాలని నిర్ణయించడమో జరిగిపోతాయన్నారు. చరిత్రలో జులై 12 మిగిలిపోవడం గ్యారంటీ అని కొందరు నేతలు గొంతు చించుకొన్నారు. అయితే కాంగ్రెస్ టైం ఫ్రేమ్ డేట్లలో జులై 12 ఒకటైందే తప్ప ఎలాంటి ప్రత్యేకత లేదు. తెలంగాణపై ఏమీ తేల్చకుండా.. తన మార్క్ రాజకీయంతో ఎప్పట్లాగే నాన్చింది. ఏమైవుతుందో.. ఏమోనన్న నరాలు తెగే ఉత్కంఠకు హైకమాండ్ తనదైన శైలిలో తెరదించింది. తెలంగాణ ఆకాంక్ష చాలా బలంగా ఉందని.. దాన్ని తాము గౌరవిస్తున్నామని త్వరలోనే తగిన నిర్ణయం తీసుకొంటామని ప్రకటించి ప్రస్తుతానికి గట్టెక్కింది.
ఏదో ఒకటి చెప్పేస్తామంటూ కట్టుదిట్టమైన కథ, స్క్రీన్ ప్లే రచించిన ఢిల్లీ పెద్దలు మరింత అధ్యయనం చేయాలంటూ తీవ్ర ఉత్కంఠకు తెర తీశారు. రెండు గంటలపాటు జరిగిన కోర్ కమిటీ సమావేశానంతరం దిగ్విజయ్ సింగ్ మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. పార్టీలోని అత్యున్నత నిర్ణాయక విభాగం వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అయితే, వర్కింగ్ కమిటీ సమావేశం ఎప్పుడు జరుగుతుందనే విషయాన్ని ఆయన చెప్పలేదు. కోర్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలపై వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
తెలంగాణపై ఏమీ తేలదని ముందు నుంచి అందరూ ఊహిస్తూనే ఉన్నారు. కాకపోతే రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జ్ గా వచ్చిన దిగ్విజయ్ హంగామా చూసేసరికి తెలంగాణవాదులకి కొత్త జోష్ వచ్చింది. ఇక రాష్ట్రాన్ని విడగొట్టడమే మిగిలిందన్నంతా బిల్డప్ ఇచ్చారు. రోడ్ మ్యాప్ లు తీసుకురావాలని కిరణ్, బొత్స, దామోదరానికి సూచించడం... రాయల తెలంగాణ ఇవ్వొచ్చన్న ప్రచారం జరిగేసరికి సీమాంధ్ర నేతల్లో ఆందోళన పెరిగింది. అంతే ఎవరికి వారు గ్రూప్ లు కట్టి వ్యూహా, ప్రతివ్యూహాల్లో మునిగిపోయారు.
రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుంటున్నట్లు బలమైన సంకేతాలు ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణాపై నిర్ణయాన్ని నాన్చడానికే మొగ్గు చూపుతుందని కోర్ కమిటీ మీటింగ్ కు ముందే అర్థమైంది. స్వీట్లు పంచిన దిగ్విజయ్ నాలుక మడతేసేసరికి ఫ్యూచర్ సీన్ కనిపించింది. తెలంగాణ సమస్యను పరిష్కరించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలనడం.. సమస్య చిన్నది కాదని ఓ పట్టాన తేలదని వ్యాఖ్యానించడం.. రోడ్ మ్యాప్ ఎన్నికలకే కానీ ప్రాంత విభజనకు కాదని స్పష్టం చేసేసరికి తెలంగాణపై నిర్ణయం అంత తేలికగా తేలదని అప్పుడే చెప్పకనే చెప్పారు దిగ్విజయ్ సింగ్..