ప్రధానమంత్రి నివాసంలో కోర్ కమిటి సమావేశం ప్రారంభమైంది. కేవలం ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం మీద నిర్ణయం తీసుకోవటం కోసం జరుగుతున్న ఈ సమావేశంలో పాల్గొంటున్నవారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ, గులామ్ నబీ ఆజాద్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ కోర్ కమిటీ ఆహ్వానం మేరకు తమ తమ అభిప్రాయాలను కూడా తీసుకుని వెళ్ళి వాటిని కోర్ కమిటీ ముందుంచారు.
ఈ లోపలో బయట గుమిగూడి ఆందోళనకు దిగిన తెలంగాణ, సమైక్యాంధ్ర విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు.