అవును.. ఎన్టీఆర్ సమంతని పెళ్లి చేసుకొంటున్నాడు. రామోజీ ఫిల్మ్‌సిటీలో అందుకు తగిన అన్ని ఏర్పాట్లూ జరిగిపోతున్నాయి. ఈ రోజే ముహూర్తం. కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు! ఇదంతా సినిమా కోసమే. ఎన్టీఆర్, సమంత జంటగా నటిస్తున్న చిత్రం రామయ్యా వస్తావయ్యా. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రస్తుతం ఆర్.ఎఫ్.సీలో పెళ్లి సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ అంతా చకచక సాగుతోంది. వీలైనంత తొందరగా సినిమాని పూర్తి చేయాలని దిల్‌రాజు ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నారు. సెప్టెంబరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రుతిహాసన్ ఓ మెరుపులాంటి పాత్రలో కనిపించనుంది.