అనుష్క పెళ్లెప్పుడు..? ఎవరిని చేసుకొంటుంది? ఫలానా హీరో తనయుడు (ఆయనా హీరోనేలెండి) ప్రేమాయణం నడుపుతోందట కదా, ఇద్దరూ ఒకేచోట ఉంటున్నారట కదా..? ఇలాంటి ప్రశ్నలెన్నో. వాటన్నింటికీ సమాధానం చెప్పకనే చెప్పేసింది. ''నా పెళ్లి గురించి మీడియా చాలా రాసింది. అందుకే ఆ సంగతులన్నీ వాళ్లకే తెలుసు. పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు నాకూ ఉన్నాయి. అతి త్వరలోనే పెళ్లిచేసుకొంటా. కానీ నాకు కావల్సిన అర్హతలు ఉన్నవాడు దొరకాలి. అయితే నాది ప్రేమ వివాహమే. తమిళ నటుడు ఆర్య, నేనూ ప్రేమించుకొంటున్నామని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. అదంతా మీడియా సృష్టి...'' అంటోంది అనుష్క. ఇంత సడన్ గా జేజమ్మకు పెళ్లిపై మనసెందుకు వెళ్లిందో...? వరుసగా భారీ సినిమాలు చేస్తూకష్టపడిపోయింది కదా..? ఇక రిలాక్స్ అయిపోదాం అనుకొంటుందేమో..?
Sunday, 17 November 2013
Tollywood