కమల్ హాసన్ ముద్దుల కూతురు శ్రుతి హాసన్ సినిమా ఇండస్ట్రీకి ప్రస్తుతం టాప్ రేసులో దూసుకుపోతుంది. అయితే ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్త లో పెద్ద సినిమాల్లో నటించినా కానీ సరైన హిట్టులేక ఓ దశలో ఐరెన్ లెగ్ అనే ముద్ర పడుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ సరసన ‘గబ్బర్ సింగ్ ’ సినిమాలో నటించి పెద్ద హిట్ కొట్టి , ఆ తరువాత స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు సంపాదించుకుంటూ బిజీ అయింది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల్లో నటిస్తున్న శ్రుతి హాసన్ ఈ మధ్యనే ఆమె నటించిన ‘బలుపు ’ సినిమా విడుదల అయి హిట్ తెచ్చుకోవడంతో శ్రుతి తెగ ఆనందపడిపోతుంది.
ఈ ఆనందం, స్టార్ డమ్ వెనుక పెద్ద కథే ఉందని గుర్తు చేసుకుంది. తాను పరాజయాల బాటలో ఉన్నప్పుడు హరీష్ శంకర్ వచ్చి ‘గబ్బర్ సింగ్ ’ సినిమాలో నటించమని అడిగాడు. మొదట నేను ఆ సినిమాకు అంగీకరించలేదు. అందులో కథానాయిక పాత్రకు అంతగా ప్రాధాన్యం ఉండదు కదా ? అని తిరస్కరించిందట. కానీ దర్శకుడు హరీష్ శంకర్ ఈ స్టోరీ ‘దబాంగ్ ’దే అయినా అందులో చాలా మార్పులు చేశానని చెప్పి, ఇందులో నటించమని బలవంతం చేశాడట. దాంతో ఒప్పుకోక తప్పలేదని చెప్పుకొచ్చింది. ఏమైతేనేం ఆ రోజు హరీశ్ శంకర్ బలవంతం చేయపోయి ఉంటే శ్రుతికి ఇన్ని ఆఫర్లు వచ్చేవి కావేమో ?