ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Friday, 23 August 2013

    'ఆ నలుగురు'.. 40మందితో సమానం

    TDP MPs Agiatation Against telangana in parliament
    అంత పెద్ద పార్లమెంటు సభను కేవలం నలుగురు సభ్యులు ప్రభావితం చేయగలరా? సాధ్యమే కాదు. అందులోకి దక్షిణాది నేతలంటే ఒకలాంటి చిన్నచూపు ఉన్న పార్లమెంటులో.. వారి వాయిస్ మహా అయితే పదినిమిషాలకు మించి వినిపిస్తే గ్రేట్. ఇక.. చాల్లే చేసింది చాలు. వెళ్లి సీట్లో కూర్చో లాంటి మాటలు అన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే.. 545మంది సభ్యలున్న సభను కేవలం నలుగురు సభ్యులు మొత్తంగా.. తమ బాధను.. తమ ప్రజల ఆకాంక్షను దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేయటం చిన్నవిషయమేమీ కాదు. అలాంటి అరుదైన కార్యాన్ని తెలుగుదేశం పార్టీ ఎంపీలు విజయవంతంగా పూర్తి చేశారని చెప్పాలి. ఎలాంటి చర్చ లేకుండా.. దశాబ్దాల తరబడి సాగుతున్న తెలంగాణ విభజన వివాదాన్ని కేవలం కొద్ది వారాల చర్చలతో హడావుడిగా... తమ రాజకీయ ప్రయోజనం కోసం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై సానుకూల ప్రకటన చేయటం.. పదమూడు జిల్లాల సీమాంధ్రుల ప్రయోజనాలను.. వారికి ఎదురయ్యే సమస్యలను.. భవిష్యత్తు ఇబ్బందులను మాట మాత్రం కూడా ప్రస్తావించకుండా.. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలోనన్న ఎక్సర్ సైజ్ చేయకుండా ఒంటెద్దు పోకడలు పోతున్న అధికారపక్ష నిరంకుశ విధానాన్ని వెలుగులోకి తేవటం చిన్న విషయం కాదు.

    సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు అరడజను కంటే ఎక్కువ ఉన్నా.. ఎంపీలు పదుల సంఖ్యలో ఉన్నా.. గోడ వెనుక దాక్కున్నట్లు.. ఉత్తుత్తి నిరసనలతో దొంగ నాటకాలు ఆడుతుంటే.. అందుకు భిన్నంగా టీడీపీ ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, నిమ్మల కష్ణప్ప, శివప్రసాద్, కొనకళ్ల నారాయణలు చూపిన తెగువ అంతాఇంతా కాదు. సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ సభలో రెండువారాలు నిరసన తెలుపుతూ.. సభాకార్యకలాపాలు స్తంభించేలా చేయటం వారికే చెల్లిందని చెప్పాలి. విలువైన కాలం హరించుకుపోవటం నిజమే. కానీ.. విభజన జరిగితే పదిన్నరకోట్ల మంది భవిష్యత్తు ప్రమాదంలో పడటమే కాకుండా.. తెలుగు ప్రజల ప్రయోజనాలు భారీగా దెబ్బతినటం ఖాయం.

    కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ వాదనను వినిపిస్తూ.. అబద్ధాలను.. నిజాలుగా నమ్మిస్తున్న తెలంగాణ నేతల మాటల ప్రభావానికి లోను కావటం అంటే.. బ్లాక్ మొయిలింగ్ కు పచ్చజెండా ఊపటమే. ‘‘సీమాంధ్ర పారిశ్రామికవేత్తల్ని బెదిరించి, చందాలు వసూలు చేసి, సినిమా విడుదలకు ఇంతని చెప్పి డబ్బులు వసూలు చేసి తెలంగాన ఉద్యమం నడిపారని అభియోగాలున్నా.. మేం ఏ రోజు వాటిపై మాట్లాడలేదు. వారి ఉద్యమాన్ని కించపర్చలేదు. సీమాంధ్రలో జరుగుతున్నది ప్రజా ఉద్యమం. విద్యార్థులు, ఉద్యోగులు, ఎన్జీవోలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి చేస్తున్న ఉద్యమం. వారి వెనుక ఏ నాయకుడు లేడు. వీరి ఉద్యమానికి డబ్బు కూడా అవసరం లేదు. కానీ.. తెలంగాణ వాదులు సీమాంధ్రుల ఉద్యమాన్ని ఎంత చులకనగా మాట్లాడుతున్నారో వారి వ్యాఖ్యల్నిచూస్తే అర్థమవుతుంది’’ అని కొనకళ్ల నారాయణ ఆవేదన వ్యక్తం చేయటం సముచితమేనని చెప్పాలి. తెలంగాణ ఎంపీల సూటిపోటీ మాటల్ని భరిస్తూ.. వారి అవహేళనను ఓర్చుకుంటూ లోక్ సభలో నిరసన చేయటం అంటే చిన్న విషయం కాదు. అందుకు ఆ నలుగురు.. నలభై మందితో సమానం అనటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

    Tollywood

    Bollywood

    Kollywood