ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here

Friday, 23 August 2013

వణికిపోతున్న వైఎస్సార్ ఎమ్మెల్యేలు

No Hype for Vijayamma Samara Deeksha
అడ్డంగా మాట తిప్పేయటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మించిన వారు వేరొకరు ఉండరు. రాష్ట్ర విభజన ప్రకటన వరకు తమకు సమ్మతమేనని చెప్పిన నేతలు.. ప్రకటన వచ్చాక ఒక్కసారి ప్లేటు మార్చేశారు. తమకు విభజన ఏ మాత్రం సమ్మతం కాదంటూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసేశారు. అవింకా ఆమోదం పొందకపోవటం.. అది వేరే సంగతి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దీక్ష చేపట్టటం.. దానికి ప్రజాస్పందన అంతంతమాత్రంగా ఉండటం ఆ పార్టీ నేతల్ని అయోమయంలో పడేస్తుంది. తాము రాజీనామాలు చేస్తే.. తమ పార్టీ ఏకంగా ప్లేటు తిప్పేసినా ప్రజల్లో స్పందన అంతంతమాత్రంగా ఉండటం వారిలో ఆందోళన పెంచుతోంది. ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న... ఆ ప్రభావం చాలా పరిమితంగా ఉన్న నేపథ్యంలో.. తమ పార్టీ పరపతి తగ్గిపోయిందా? అన్న సందేహాలు ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. మాట మీద నిలబడే వంశమని.. మడమ తిప్పమని బీరాలు పలికే తమను జనాలు నమ్మటం మానేశారన్న సందేహం వారిని ఒక చోట నిలువనీయటం లేదు.

విజయమ్మ దీక్షతో.. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం మరింత ఊపందుకుంటుందని..రానున్న ఎన్నికల్లో తమకు ఎదురే ఉండదని.. అధికారం ఖాయమని కాకిలెక్కలు వేసుకుంటున్న ఆ పార్టీ నేతలకు.. ఊహకు, వాస్తవానికి మధ్య తేడా ఆమరణదీక్ష చెప్పకనే చెప్పిందని వాపోతున్నారు. మొన్నటిదాకా ఎన్నికలంటే ఎప్పుడెప్పుడా అంటూ ఉత్సాహం చూపించిన వారు.. ఇప్పుడు ఎన్నికలంటేనే వణికిపోతున్నారు. ఎన్నికలకు మరో ఏడెనిమిదినెలల సమయం ఉన్న నేపథ్యంలో.. జగన్ ఒక్కసారి బయటకు వస్తే తమ పరిస్థితి మొత్తం మారిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజమే.. ప్రజాభిమానం లేనప్పుడు నమ్మకమే నడిపిస్తుంది. అది కూడా లేకపోతే.. చాలా కష్టం. 

Post Comments