సమైక్యాంధ్ర జేఏసి నేతలు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న బొత్స సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేయాలని, అలాగే సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులంతా తమ పదవులకు రాజీనామా చేసి పాలనా పరమైన సంక్షోభాన్ని సృష్టించాలని సమైక్యాంధ్రవాదులు డిమాండ్ చేశారు.
ఉద్యమానికి సహకరించని నాయకులకు తీవ్రపరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో విజయనగరం పట్టణం మొత్తం పోలీసులు వలయంలో చిక్కుకొంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.