ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 1 August 2013

    హన్సిక రేటు బోలెడంత

    Hansika Hike Her Rates
    హవ్వా... ఇంత రేటా.. అంటూ దడుసుకునేలా హీరోయిన్ హన్సిక తన రేటును పెంచిందని టాలీవుడ్ వర్గాలు కోడై కూస్థున్నాయి. ఆ రేటు విని హడలిపోయి వద్దులే బాబు అని వెనక్కి వెల్లిన వారు అంత అందగత్తె ఆరేటుకు దొరకక తిరిగి ఆమె వద్దకే వచ్చి ఒప్పుకుని హన్సిక ను బుక్ చేసుకున్నారు వారి సినిమాలో.

    అయినా ఈరోజుల్లో డబ్బు సంపాదనే ముఖ్యం కదా.. దానికి హీరోయిన్లు అతీతులు కాదుకదా, పైగా డిమాండు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకుంటే ఆతర్వాత జీవితం హ్యాపీగా గడిపేయొచ్చు అన్నది నేటి తరం భామల ఆలోచన. రేపు పెళ్లయి డిమాండ్ తగ్గినా, సినిమాలకు దూరమైనా, లేక తమకంటే అందగత్తెలు పోటీకి వచ్చి డిమాండ్ పడిపోయినా ప్రమాదం కదా.

    నాగచైతన్యతో నాగార్జున ‘హలో బ్రదర్’ సినిమా రీమేక్ చేస్థున్న విషయం తెలిసిందే. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఇద్దరు హీరోయిన్లు అవసరం. అందులో నెంబర్ వన్ కథానాయికగా హన్సిక ను తీసుకునేందుకు వెలితే గతంలో ఆమె తీసుకున్న దానికంటే ఎంతో ఎక్కువ రేటు పెంచి చెప్పిందట. తమ వల్ల కాదంటూ వెల్లిపోయిన వారు, అంత చబ్బీ అందగత్తె దొరకక తిరిగి వచ్చి మళ్లీ హన్సికకే ఓకే చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. పెళ్లి చేసుకోవడం లేదు, మరో అయిదేళ్లపాటు పెళ్లి చేసుకోకుండా సినిమాలపైనే దృష్టిపెడ్తానని చెబితే ఏమో అనుకున్నాం కాని ఇంత సంపాదించాలని టార్గెట్ పెట్టుకుందని అనుకోలేదు ఎవరు అంటూ టాలీవుడ్ లో గుసగుసలాడుకుంటున్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood