ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here

Friday, 23 August 2013

'అత్తారింటికి దారేది'కి అడ్డు లేదిక

attarintiki daaredi grand release
పవన్ కళ్యాణ్ అత్తగారింటికి దారికి అడ్డు లేదిక, ఇక ఎవరు ఆపినా, అడ్డంగా పడుకున్నా అది తెరపైకి వస్థోంది, నిర్మాత ప్రసాద్ ఇక నిర్ణయానికి వచ్చేసాడు, రాంచరణ్ ఎవడు కు ముందుగానే విడుదల చేసేందుకు సమాయుత్త మయ్యాడు. ఇదే నెల 29, 30తేదీల్లో ఒకరోజు ఈ సినిమా విడుదలను ఖరారు చేయనున్నారు.

ఈసినిమాను కొనుగోలు చేసిన వారు కూడా విసిగిపోయారట, విడుదల చేసినా చేయకపోయినా నష్టం తప్పేలా లేదు, అదేదో ఇప్పుడే తేల్చుకుంటాం అంటూ బయ్యర్లు కూడా విడుదల కోసం ముందుకు వచ్చేసారు. సమైక్యాంధ్ర గొడవ ఇప్పట్లో చల్లారేలా లేదు, ఒక వేళ కేంద్రం నిర్ణయం మార్చుకుంటే తెలంగాణలో ఇదే పరిస్థితి. అందుకే ఇక నో వెయిటింగ్ అంటూ తెరపైకి తెచ్చేస్థున్నారు. ఇక ఎంజాయ్ చేయడం పవన్ అభిమానుల వంతు.

Post Comments