ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Saturday, 24 August 2013

    జంజీర్ వస్తుంది కానీ తుఫాన్ ఇప్పట్లో రానట్టే

    Zanjeer Release Confirmed
    సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న సమైఖ్య ఉద్యమ సెగలతో మెగా కుటుంబం నలిగిపోతోంది. ఆ కుటుంబ హీరోలకు చెందిన రెండు బడా సినిమాలు ఇప్పటికే ఆగిపోయి వాటికి మోక్షం ఎప్పుడో తెలియని పరిస్థితిలో చిక్కుకున్నాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో వచ్చేనెల 6వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న జంజీర్ సినిమా విడుదల అవుతుందా..? అవదా..? అనే చర్చలకు తెర దించుతూ ఆ సినిమా నిర్మాతలు వచ్చేనెల అనుకున్న విధంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అప్పుడే పబ్లిసిటీ ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు.

    ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘తుఫాన్’ అదే రోజు 6 వ తారిఖు ఆంధ్రప్రదేశ్ లో కూడా విడుదల కావాల్సి ఉంది. సమైక్య ఉద్యమ నేపధ్యంలో ప్రస్తుతం ఈ సినిమాకు కూడా అడ్డంకులు వస్తాయా..? అనే సంశయం రామ్ చరణ్ ను చిరంజీవి ని పట్టి పీడిస్తోందట. అందువల్ల జంజీర్ తెలుగు వెర్షన్ తుఫాన్ ను ఆపుచేసి జంజీర్ ను మాత్రం తీసుకువస్తే బాగుంటుంది అనే ఆలోచన తో తండ్రీ కొడుకులు ఉన్నారని అంటున్నారు. ఈ విషయంపై ఈ సినిమా దర్శకుడు అపూర్వ లాఖియా ను ఈ సినిమా నిర్మాతలను కూడా ఒప్పించడానికి చెర్రీ ప్రయత్నిస్తున్నాడని లేటెస్ట్ రూమర్. ఈ ఆలోచన వల్లే తుఫాన్ ఆడియో వేడుకను కూడా వాయిదా వేశారని అందువల్ల జంజీర్ వస్తుంది కాని తుఫాన్ రాదు అంటూ వార్తలు వస్తున్నాయి.

    గత మూడు వారాలుగా సీమాంధ్ర ప్రాంతాలలో జరుగుతున్న ఉద్యమాల సెగ వల్ల టాలీవుడ్ కు ఇప్పటికే కొన్ని వందకోట్ల వరకు నష్టం ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా మెగా కుటుంబ హీరోల సినిమాలను అత్యధిక మొత్తాలకు రైట్స్ దక్కించుకున్న పంపిణి దారులు ఆ సినిమా నిర్మాతలకు తామిచ్చిన అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేయవలసిందిగా ఒత్తిడి చేస్తున్నారని, ఈ ఒత్తిడితో మెగా హీరోల సినిమాలను నిర్మించిన నిర్మాతలు చుక్కలు లెక్క పెడుతున్నారని వార్తలు ఫిల్మ్ నగర్ లో వస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే జంజీర్ కు గ్రీన్ లైట్, తుఫాన్ కు రెడ్ లైట్ పడినట్లే కనిపిస్తోంది.

    Tollywood

    Bollywood

    Kollywood