ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here

Tuesday, 6 August 2013

కేసీఆర్‌కు హాని జరిగితే రాష్ట్రం అల్లకల్లోలమే : ఈటెల

KCR Murder Supari, KCR Murder Plan
హైదరాబాద్ : తెలంగాణ నాలుగున్నార కోట్లు ఆశాకిరణం కేసీఆర్‌ను కొన్ని శక్తులు హత్య చేయాలని కుట్ర పన్నుతున్నాయని, కేసీఆర్‌కు ఏమైనా జరగకూడనిది జరిగితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని టీఆర్‌ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేంద్ర, ఉపనేత హరీష్‌రావు హెచ్చరించారు. కేసీఆర్‌ను హత్య చేయడానికి కొన్ని దుష్టక్తులు యత్నిస్తున్నట్టు సమాచారముందని హరీష్‌రావు తెలిపారు. మూడు రోజుల క్రితం ఇంటిలిజెన్స్ ఐజీని కలిసి వివరాలు అందజేసినట్లు వారు పేర్కొన్నారు. కుట్ర ఫోన్‌కాల్స్ పరంపర కొనసాగుతుందని మండి పడ్డారు. దీనికి సంబంధించి పార్టీ తరపున ప్రభుత్వానికి రిట్‌పిటిషన్ సమర్పిస్తామన్నారు.

కేసీఆర్‌ను హతమార్చాలనుకోవడం పిరికిపందల చర్య అని వారు మండిపడ్డారు. కేసీఆర్‌ను హత్య చేయడానికి ఎవరు సుపారి అఫర్ చేశారో, ఎవరు తీసుకోవడానికి వచ్చారో తమ దగ్గర సమాచారం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎటాంటి భేషజాలు లేకుండా కేసీఆర్‌కు జెడ్‌ప్లస్ కేటగిరి సెక్యూరిటీ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కుట్రపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని కూడా వారు కోరారు. సీమాంద్ర దోపిడిదారులూ కేసీఆర్‌ను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆ పార్టీ నేత కర్నె ప్రభాకర్ ఆరోపించారు. పోలీసులు కేసీఆర్‌ను కంటికిరెప్పాల కాపాడాలని టీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు.

Post Comments