ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Tuesday, 6 August 2013

    న‌వ్వుకుందాం రా అంటున్న వెంకీ

    Navvukundam Ra, Venkatesh, Ram
    వెంక‌టేష్ మ‌రోసారి రా.... అని పిలుస్తున్నాడు. అయితే  ఈసారి మాత్రం ప్రేమ‌కోస‌మో, పెళ్లి కోసమో కాదు. న‌వ్వుకోవ‌డానికి రా అంటున్నాడు. ఆయ‌న రామ్‌తో క‌లిసి న‌టిస్తున్న చిత్రానికి న‌వ్వుకుందాం రా అనే పేరును ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రానికి  విజ‌య్‌భాస్కర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. అంజ‌లి, సాజ‌న్ ప‌ద‌మ్‌సీ క‌థానాయిక‌లు.  ఇప్పటిదాకా ఈసినిమాకి అర‌డ‌జ‌ను పేర్లు ప్రచారంలోకి వ‌చ్చాయి. చివ‌ర‌కు న‌వ్వుకుందాం రా అనే పేరును ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం.

    వెంక‌టేష్ సినిమాల‌కి కాస్త సెంటిమెంటు ఎక్కువ‌. సినిమాల పేర్లకు చివ‌ర‌న రా... అనే అక్షరం  వ‌స్తే ఆ సినిమా హిట్టవుతాయ‌నేది న‌మ్మకం. ఆ సూత్రం ఆధారంగానే ఈ సినిమాకి పేరును ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం. అయితే ఇంకా అధికారికంగా వెల్లడించ‌లేదు. మొద‌ట్నుంచీ ఈ సినిమాకి వ‌చ్చిన పేర్లను ప‌రిశీలిస్తే... గ‌ర‌మ్‌మ‌సాలా, గోల్‌మాల్‌, బ్లాక్ బ‌స్టర్‌, రామ్ బ‌ల‌రామ్‌... ఇలా ఇంకో రెండు పేర్లు ప్రచారంలోకి వ‌చ్చాయి. అయితే వాట‌న్నిటినీ ప‌క్కన పెట్టి ఇప్పుడు న‌వ్వుకుందాం రా అనే పేరును ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తోంది.

    Tollywood

    Bollywood

    Kollywood