ప్రిన్స్ మహేష్ బాబు తన పుట్టిన రోజును ఈ సారి తన అభిమానులకు దూరంగా లండన్ లో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మహేష్ కు అభిమానులుగా టాలీవుడ్ లోని చాలామంది ప్రముఖ నిర్మాతలు కూడా ఉన్నారు. ఆ లిస్టులో తనతో దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసిన నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర పేరు మొదటగా ఉంటుంది. ఒక నిర్మాత అయి ఉండి కూడా అనిల్ సుంకర ఓ అభిమానిలా తన కథానాయకుడికి ఓ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు.
ఇంతకీ ఆ గిఫ్ట్ ఎంటి అనుకుంటున్నారా? మహేష్ పుట్టిన రోజున ఆయన పేరు మీద ఓ కొత్త యాప్ ని విడుదల చేయడానికి అనిల్ నేతృత్వంలోని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ప్లాన్ చేస్తోంది అని తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న '1' సినిమాకు కూడా అనిల్ సుంకర నిర్మాత. పుట్టినరోజున మహేష్ అభిమానుల కోసం ఓ ట్రైలర్ ను కూడా విడుదల చేస్తుండగా, మహేష్ పేరు మీద ఓ కొత్త యాప్ ను కూడా రిలీజ్ టాలీవుడ్ టాక్ గా మారింది. ఇక యాప్ గురించి మిగతా వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఈ చిత్రం షూటింగు గత కొన్ని రోజులుగా లండన్లో జరుగుతోంది. ప్రస్తుతం మహేష్, సోఫీ చౌదరిలపై ఓ ఐటెం సాంగు షూట్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే.
సినిమాలలో బ్రాండ్ ఎండార్స్ మెంట్లలో రోజుకొక రికార్డు క్రియేట్ చేసుకుంటున్న ప్రిన్స్ మహేష్ తన కెరియర్ ను చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఎటువంటి వివాదాల జోలికి వెళ్ళకుండా ఒక టోటల్ ఫిలిం సెలెబ్రెటీ లా అటు మాస్ కు ఇటు క్లాస్ కు వారధిగా టాలీవుడ్ నెంబర్ వన్ స్థానానికి వడివడిగా అడుగులు వేసుకుంటూ తన పుట్టినరోజును ‘1’ యూనిట్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా లండన్ లో జరుపుకొబోతున్నాడట....