ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 8 August 2013

    పవన్ కళ్యాణ్ పరేషాన్ ను పండుగ చేసుకుంటున్న తేజ

    Pawan Kalyan Sad Mood, Pawan Kalyan Sad
    ఒకరి ఇబ్బందులు మరొకరి సంబారాలు అంటే ఇదే మరి, ఎలాంటి విరోదం లేకున్నా... కూడా నెలకొన్న తాజా పరిస్థితులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పడుతున్న పరేషాన్ ను తేజకు పండుగ చేసుకోబోతున్నాడు అంటున్నారు.

    నిజానికి ఇప్పుడు సినిమాలకు పండగ లాంటి సీజన్, సెలవులు కలిసి వచ్చే ఈవేల సినిమాలు విడుదల చేస్థే వాటికి మహర్దశే. అందుకే కోట్లాది రూపాయలతో తీసిన ‘ఎవడు’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలను ఇప్పుడే విడుదల చేయాలనుకున్నారు. వీటితో రాంచరణ్, పవన్ కళ్యాణ్ లు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్టు కొట్టాలనుకున్నారు.

    అయితే రాజకీయ కారణాల వల్ల రాంచరణ్ ‘ఎవడు’ వాయిదా పడింది. కాని పవన్ కళ్యాణ్ మాత్రం తన ‘అత్తారింటికి దారేది’ సినిమాకు రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు అడ్డు రావని ఈనెల 7ననే విడుదల చేయాలనుకున్నాడు, అంతలోనే రెండు రోజులు వాయిదా వేసాడు. ఇంతలోనే లేటెస్టుగా రాజకీయ సెగ తగులుతోందన్న ఇబ్బందుల్లో పడి వాయిదా వేయాలనుకుంటున్నాడని, కాదు కాదు వాయిదా వేసాడని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.

    దీంతో ఈ అసలైన సమయాన్ని వినియోగించుకుని లాభపడేందుకు ఇప్పటికే పూర్థయిన చిన్న సినిమాలు సంబరాలు జరుపుకునేందుకు సిద్దమయ్యాయి. వీటిలో ప్రధానమైనది తేజ సినిమా ‘1000 అబద్దాలు’. అందుకే పవన్ కళ్యాణ్ కు వచ్చిన ఇబ్బందులను తేజ పండుగ చేసుకోబోతున్నాడు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

    Tollywood

    Bollywood

    Kollywood