ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 8 August 2013

    చెర్రీ తో కృష్ణ వంశీ మల్టీ స్టారర్

    RAMCHARAN IS DOING A MULTISTARER WITH Krishna Vamsi
    హీరో రామ్ చరణ్ మల్టీస్టారర్ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడా? ఇప్పుడు ఇదే టాలీవుడ్ లో హాట్ న్యూస్. ప్రస్తుతం  మల్టిస్టారర్స్ టైమ్ నడుస్తోంది కాబట్టి ఆ ట్రెండ్ ని అనుసరిస్తూ రామ్ చరణ్ మరో మల్టిస్టారర్ కి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తో పాటు ఈ సారి వెంకటేష్, సూపర్ స్టార్ కృష్ణ నటించనున్నారని అంటున్నారు. ఈ చిత్రాన్ని కృష్ణ వంశీ డైరక్ట్ చేయనున్నారట. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది. అయితే ఆ కథ ఇంతకు ముందు నాగచైతన్య,నాగార్జున, అక్కినేనిలతో కృష్ణ వంశీ చేద్దామనుకున్న కథే అని టాలీవుడ్ లో అంటున్నారు.

     కొరటాల శివ దర్సకత్వంలో రామ్ చరణ్ చేస్తాడు అనుకున్న సినిమా ఆఖరి నిముషంలో ఆగి పోవడంతో చరణ్ సినిమాలకు సంబంధించి ప్లాన్ పూర్తిగా అప్సట్ కావడంతో చరణ్ ప్రస్తుతం తన చేతిలో ఏ సినిమాలు లేని స్థితిలో పడిపోయాడు. ఈ పరిస్తుతులలోనే చెర్రీ నిర్మాత డి.వి.వి. దానయ్య సినిమాలో నటిస్తాడు అంటూ వార్తలు వచ్చాయి. ఈ లోపునే దర్శకుడు కృష్ణవంశీ చరణ్ ను కలిసి ఒక కధ చెప్పాడని ఆ కధ చెర్రీకి బాగా నచ్చిందని వార్తలు కూడా వచ్చాయి. ఏదోవిధంగా చరణ్ తో సినిమా తీయాలి అని పట్టుదల మీద ఉన్న బండ్ల గణేష్ కృష్ణ వంశీ కధకు చరణ్ ఒప్పుకున్నాడని తెలియగానే ఈ భారీ మల్టీ స్టారర్ మూవీని నిర్మించడానికి ముందుకు వచ్చినట్లుగా తెలిసింది.

    చిరంజీవి తో సినిమాలు చేద్దామని కలలు కనీ ఆ కలలు తీరని కృష్ణవంశీ చిరంజీవి కుమారుడుతో చేసే ఈ సినిమాకు మెగా కుటుంబానికి సన్నిహితుడైన బండ్ల గణేష్ ఈ భారీ ప్రాజెక్ట్స్ కు నిర్మాత కావడం యాదృచ్చికం అనుకోవాలి. ఈ వార్తలే నిజమైతే వచ్చే సంవత్సరం మరో భారీ మల్టీస్టారర్ రాబోతోంది అన్న మాట....

    Tollywood

    Bollywood

    Kollywood