పెద్దపెద్ద కంపెనీలకు ప్రచార కర్తలుగా వ్యవహరిస్తూ కోట్లకు పైగా పారితోషికాలు తీసుకునే మన టాప్ హీరోలు తమను అంత వారిని చేసిన అభిమానుల గురించి పట్టించుకునే సందర్భాలు చాల అరుదు. ఏదైనా ఒక విషయం పై అభిప్రాయాన్ని చెప్పాలిసిన పరిస్థితి ఏర్పడితే మౌనం వహిస్తూ గోడ మీద పిల్లులులా రోజులు గడిపేస్తూ ఉంటారు మన టాప్ హీరోలు. కానీ ఈ పద్దతికి భిన్నంగా మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడు లోని కోలీవుడ్ హీరో అజిత్ మాత్రం ఒక మంచి పని కోసం ఒక వినూత్న ప్రచారాన్ని నిర్వహించి తన తోటి హీరోలకు ఆదర్శప్రాయంగా నిలిచాడు.
ఈ మధ్యన అజిత్ చైన్నై లోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో తన కొత్త మోడల్ ఫాన్సీ బైక్ BMW S1000RR పై చక్కర్లు కొడుతూ కనిపిస్తే చాలామంది చాల సేపు అది అజిత్ సినిమాకు సంబంధించిన షూటింగ్ అనుకున్నారు. కానీ కాసేపటికి అసలు విషయం తెలిసింది, అజిత్ నటిస్తున్న సినిమా షూటింగ్ కాదు, అదేవిధంగా టైంపాస్ జాయ్ ట్రిప్ కాదు. అసలు విషయం ఏమిటంటే విపరీతమైన వేగంతో మోటార్ బైక్స్ నడుపుతూ ప్రమాదాలు కొని తెచ్చి పెట్టుకుంటున్న యువతరాన్ని బైక్స్ నడిపే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెల్మెట్స్ ఉపయోగిస్తూ తమ విలువైన జీవితాలను ఎలా కాపాడుకోవాలి అనే విషయాల పై సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో విషయాలను వివరిస్తూ తమ గురించి ఇంత పట్టించుకుంటున్న హీరో నిజంగా అజిత్ ఏనా అని అనిపించేటట్లుగా అజిత్ చేస్తున్న సేవా కార్యక్రమాలు టాక్ ఆఫ్ కోలీవుడ్ గా మారాయి.
మన యంగ్ హీరోలు కూడా అజిత్ ను ఆదర్శంగా తీసుకుని ఇటువంటి సేవాకార్యక్రమాలు చేస్తే బాగుంటుందేమో. అయినా ఖాళీ దొరికితే తమ భార్య పిల్లలతో విదేశాలకు చేక్కేసే మన హీరోలకు అంత సమయం ఉండాలి కదా మరి...