సినిమాల్లో అవకాశాలు రావడమే గొప్ప అనుకొనే కథానాయికలున్నారు. అందులోనూ పెద్ద హీరోల సరసన ఛాన్స్ అంటే ఎగిరి గంతేయాల్సిందే. కానీ కాజల్ మాత్రం అలా కాదు. సినిమాల పట్ల చాలా నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. ఛాన్స్ ఇస్తే ఎంత? ఇవ్వకపోతే ఎంత? అన్నట్టు వ్యవహరిస్తోంది. కమల్‌హాసన్ సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పింది. గబ్బర్ సింగ్ 2లో నటించడానికీ ఒప్పుకోలేదు. ఈ సినిమాల్ని ఒప్పుకోలేనంత బిజీగా ఉందా అంటే అదీ లేదు. బాద్ షా తరవాత ఈ అమ్మడు ఖాళీనే. కొన్నాళ్లు సెలవలను ఎంజాయ్ చేసింది. ఆ తరవాత కూడా అదే మూడ్‌లో ఉంటోంది.
ఆమె దగ్గరకు దర్శకులు, నిర్మాతలు వెళ్లడానికి భయపడుతున్నారు. ఏదో వంక చెప్పి సినిమాల్ని వదులుకొంటోందట. కాజల్‌ని మరీ ఎక్కువైంది.. అని నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. సినిమాలపై ధ్యాస పూర్తిగా తగ్గిపోయిందట. ఇప్పుడు రూలర్ కోసం కాజల్‌ని సంప్రదిస్తుంటే చేస్తాననో, చేయననో చెప్పడం లేదట. కాజల్ ఒప్పుకొందో లేదో తెలీక నిర్మాతలు హైరానా పడిపోతున్నారు. సినిమాలపై కాజల్ కి ఈ వైరాగ్యం ఏమిటో? కొంపదీసి పెళ్లిపై మనసు మళ్లిందా??