మా ప్రాంత ప్రయోజనాలు కాపాడాలంటూ టిడిపి సభ్యులు నాలుగు రోజులుగా పార్లమెంటు ఉభయ సభల్లో నిరసన తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ రాజ్యసభలో సొమ్మసిల్లి పడిపోయారు.
ఆంధ్ర ప్రదేశ్‌ను కాపాడాలని, తమ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని సిఎం రమేష్, సుజనా చౌదరిలు రాజ్యసభలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టి వెల్‌లోకి చొచ్చుకుపోయారు.నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సమయంలో సిఎం రమేష్ సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో డిప్యూటీ చైర్మన్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.