ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 8 August 2013

    రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తున్న యంగ్ హీరో

    Nikhil, Politicians, Sonia Gandhi, Twitter
    యంగ్ హీరో నిఖిల్ తన మనస్సు లోని మాటలను ఆవేశంగా తన ట్విట్టర్ లో పెట్టడమే కాకుండా నేడు మన దేశాన్ని శాసిస్తున్న ఒక ప్రముఖ రాజకీయ వేత్త పై బాణాలు వదిలాడు. నిన్న కాశ్మీర్ దగ్గర మన భారతదేశ సరిహద్దులలో పాకిస్తాన్ ఆర్మీ జరిపిన కాల్పులలో మన దేశానికి చెందిన ఐదుగురు సైనికులు మరణించిన విషయం మన భారత జాతి యవత్తును షాక్ కు గురిచేయడమే కాకుండా నిన్న పార్లమెంట్ ను ఈ విషయం దద్దరిల్లే లా చేసింది.

    ఈ విషయంపై స్పందిస్తూ హీరో నిఖిల్ చాలా ఘాటైన మాటలు తన ట్విట్టర్ లో పెట్టాడు. ‘సిగ్గుచేటు భారత ప్రభుత్వం ఏమి చేస్తోంది మన దేశాన్ని మన జీవితాలను మన భవిష్యత్ ను ఒక విదేశీరాలు నిర్దేశిస్తూ ఉంటే మన దేశం ఏమైపోతుంది?’ అంటూ తన వ్యధను తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.

     నేటి యంగ్ హీరోలు అంతా కోట్ల సంపాదనా కాళి దొరికితే పబ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ యంగ్ హీరో మాత్రం దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న విషయాల పై శ్రద్ద చూపించి స్పందించడం గొప్ప విషయంగానే భావించాలి. నిఖిల్ పెట్టిన ఈ ట్విట్టర్ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ డి ఇండస్ట్రీ గా మారింది....

    Tollywood

    Bollywood

    Kollywood