ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Tuesday, 6 August 2013

    చెర్రీ తో తనను పోల్చి నందుకు హర్ట్ అయిన హీరో

    MANCHU MANOJ TERRIBLY DISAPOINTED WITH GETTING COMPARED WITH RAMCHARAN
    హీరో మంచు మనోజ్ మంచు వారి కుటుంబం నుంచి వచ్చినా ఆ కుటంబ లక్షణాలు అతడి వ్యక్తిత్వంలో కనిపించవని మనోజ్ అబ్జర్వ్ చేసిన వాళ్ళు అంటూ ఉంటారు. ఎదుటి వ్యక్తి లో ఉన్న గొప్ప తనాన్ని మనోజ్ పొగుడుతూ ఉంటాడే తప్ప ఎవరినీ విమర్శించడు. తాజాగా ఈ మధ్య మనోజ్ కు ఒక విచిత్ర అనుభవం ఎదురైంది. మనోజ్ వీరాభిమాని ఒకడు ఈ మధ్య అతడికి ఒక మెసేజ్ పంపించాడట ఆ మెసేజ్ ఏమిటంటే ‘అన్నా నువ్వు సూపర్ రామ్ చరణ్ కన్నా నువ్వు మరీ సూపర్’ అంటూ రామ్ చరణ్ కేవలం చిరంజీవి ఇమేజ్ వల్లే ఈ స్థాయికి రాగలిగాడు అంటు ఆవేశంగా ఏవేవో కామెంట్స్ పోస్ట్ చేసాడట.

    ఈ మితిమీరిన పొగడ్తలను చూసి మనోజ్ పొంగి పోకుండా ‘చరణ్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు నీవు ఎక్కువగా మాట్లాడకు’ అంటు ఆ మెసేజ్ కు రిప్లయ్ ఇచ్చాడట. అంతేకాదు తన ఫేస్ బుక్ పేజీలో వేరే హీరోల గురించి కామెంట్స్ పోస్ట్ చేయవద్దని వారంతా ఎంత కష్టపడి పైకి వచ్చారో తనకు తెలుసని అంటూ క్లాస్ పీకాడట. కావాలంటే తన గురించి మంచిగా చెడుగా ఏదైనా పోస్టు చేయమని ఎదుటి మనుషులను కించపరిచే మాటలు రాయవద్దని మన మంచు మనోజ్ అన్నాడని టాక్. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉండే మంచు మనోజ్ లో ఇంత సంస్కారం ఉంది అంటే చాల గొప్ప విషయం అందరూ ఇంత మంచి భావనతో ఉంటే చాల బాగుంటుంది..

    Tollywood

    Bollywood

    Kollywood