ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Tuesday, 6 August 2013

    పవన్ రెండు గంటలు ఆ హీరో పది నిముషాలతో సమానం

    RANABIR KAPOOR OFFERED JUST 15 CRORES FOR 10 MINUETS ROLE
    ‘హే జవాని హై దివాని’ సినిమా సూపర్ హిట్ తరువాత బాలీవుడ్ మిల్కీ బాయ్ రణభీర్ కపూర్ కు ఎదురులేకుండా పోయింది. అతడు సినిమాలలో నటిస్తే చాలు ఎన్ని కోట్లైనా ఇవ్వడానికి బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతున్నారు. బాలీవుడ్ లో వస్తున్న వార్తల ప్రకారం అర్జున్ రామ్ పాల్ హీరోగా నటిస్తున్న “రాయ్” సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటించడానికి హీరో రణభీర్ కు ఆ సినిమా నిర్మాత 15 కోట్లు ఆఫర్ చేసాడట. ఇందులో పెద్ద విశేషం ఏముంది అని అనుకుంటున్నారా ఇక్కడే ఉంది అసలు కధ ఈ సినిమాలో రణభీర్ కనిపించేది కేవలం 10 నిముషాలు మాత్రమే. ఈ సినిమాను రణభీర్ ప్రాణ స్నేహితుడు విక్కీ సింగ్ నిర్మిస్తున్నాడు. ప్రాణ స్నేహితుడైనా సరే 10 నిముషాలకు 15 కోట్లు అన్నాడట.

    ఈ వార్తలు విన్న మన టాలీవుడ్ వర్గాలు ఒక కొత్త లెక్కను తెర పైకి తెచ్చాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా వెలుగొందుతున్న పవన్ కళ్యాణ్ తన లేటెస్ట్ ‘అత్తారింటికి దారేది’ సినిమాకు 15 కోట్లు పారితోషికంగా తీసుకున్నాడట. దీనినిబట్టి పవర్ స్టార్ రెండు గంటల కష్టం రణభీర్ కపూర్ పది నిముషాల కష్టం తో సమానం అంటూ మన టాలీవుడ్ విశ్లేషకులు కొత్త లెక్కలకు శ్రీకారం చుట్టారు.

    Tollywood

    Bollywood

    Kollywood