ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Tuesday, 6 August 2013

    సమైక్యవాదులు ఖబడ్దార్ అంటున్న మెగా అభిమానులు

    MEGA FANS WARNING TO SAMAIKYA ANDHRA AGITATORS
    తెలంగాణా రాష్ట్ర ప్రకటనతో కోస్తా ప్రాంతం గత వారం రోజులుగా వేడెక్కి పోతోంది. ఈ వేడి మన టాలీవుడ్ కు కూడా తాకిందనే చెప్పాలి. ముఖ్యంగా మెగా కుటుంబ హీరోల సినిమాలు ఈ ఉద్యమ వేడితో తీవ్రంగా నష్టపోతున్నాయి. సమైక్య ఉద్యమకారులు రామ్ చరణ్ సినిమాలను టార్గెట్ చేస్తుండటంతో చిరంజీవి యువత నాయకులు రంగంలోకి దిగి సినిమాలకు రాజకీయాలకు ముడి పెట్ట వద్దనీ చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్ష్యుడు స్వామినాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యమకారులు తమ మెగా కుటుంబ హీరోల ఫ్లక్సీలను తగల పెడితే తాము సహించమనీ చెపుతూ తమకు పార్టీలు ప్రాంతాలు లేవని తమ మనోభావాలను దెబ్బతీస్తే మటుకు ఎటువంటి వారినైనా క్షమించమనీ దానికి తగ్గ గుణపాఠం చెపుతామని ప్రకటించారు.

     ఈ పరిస్థుతులు ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులు రాష్ట్రంలో ఉద్యమాలు నడుపుతున్న జేఏసీ లకు తమ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా సందేశాలు పంపుతూ తమ హీరో సినిమాలను అడ్డు కోవద్దనీ తమ హీరోకు తెలంగాణ ఆంధ్రా అన్న భేధాలు లేవని ఈ విషయం గ్రహించకుండా ఏ ఉద్యమకారులైనా తమ హీరో సినిమాలను అడ్డుకుంటే ఖబడ్దార్ అంటూ సమైక్యవాదులను హెచ్చరిస్తూ మెసేజ్ లు పంపుతున్నట్లుగా తెలుస్తోంది.

     ఒక వైపు భాగ్యనగరం గురించి సమక్యవాదులు, తెలంగాణ వాదులు యుద్ధం చేసుకుంటున్న నేటి వర్తమాన పరిస్థుతులలో కేవలం ఒక కుటుంబ హీరోల సినిమాల గురించి అటు సమక్యవాదులు ఇటు మెగా అభిమానులు మరో యుద్ధం చేసుకోవడం చూస్తూ ఉంటే మన రాష్ట్రo ఏమైపోయి ఎటువెళ్ళి పోతోందో అనే సంశయం కలుగుతోంది..

    Tollywood

    Bollywood

    Kollywood