తెలుగు, తమిళం, హిందీ... ఎక్కడైనా పర్లేదు. అర్జంటుగా ఓ సినిమా కావాలి. అందాల ఆరబోతకు ఏమాత్రం అభ్యంతరం లేదు. పారితోషికం విషయంలో కూడా అంతగా పట్టింపులు లేవు. కాల్షీట్లు కూడా అడిగినన్ని ఇచ్చేస్తా. ఆలసించిన ఆశాభంగం ఎవరు ముందుకొస్తారో రండి అంటూ ఓ పిలుపు పిలుస్తోంది కథానాయిక తాప్సి.
సాహసంతో ఇటీవలే తెలుగులో సందడి చేసిన ఈ భామకు ఇప్పుడు అర్జంటుగా చేయడానికి సినిమాలు కావాలట. అవకాశాలు రావడం లేదని ఇటీవలే ఓ ఫొటో షూట్ చేయించుకొంది. అందంగా ఆల్బమ్ తయారు చేయించిందట. వాటిని చేతికిచ్చి ఒక్కో భాషలో ఒక్కో మేనేజర్‌ని నియమించుకొందట. అవకాశాలకోసం తిరగండి అంటూ పురమాయిస్తోందట. పాపం తాప్సికి ఎంత కష్టమొచ్చిందో కదూ.
ఈ ముద్దుగుమ్మ ఇటీవల హిందీ తెరపై తళుక్కున మెరిసింది. అక్కడ మరిన్ని సినిమాలు అందుకోవాలని చూస్తోంది. కానీ అనుకొన్న స్థాయిలో అవకాశాలే రావడం లేదు. దీంతో ఎక్కడికక్కడ మేనేజర్‌లను నియమించుకొని హల్‌చల్ చేస్తోందట. ఎలాగోలా అవకాశాలు సంపాదించండని పురమాయిస్తోందట. ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్ర పరిశ్రమపై కూడా భారీగానే ఆశలు పెట్టుకొంది. మరి దర్శకనిర్మాతలు ఈ సొట్టబుగ్గల సుందరిపై దయ తలుస్తారో లేదో చూడాలి.