కేసీఆర్ ప్రాణహాని ఉందని.. అతన్ని చంపేందుకు కిరాయిమనుషులను సంప్రదిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో.. ఆయనకు యుద్ధ ప్రాతిపదికన భద్రతను రెట్టింపు చేశారు. మెదక్ జిల్లాలోని ఫామ్ హౌస్ లో ఆయనకు ఉన్న భద్రతను రెట్టింపు చేశారు. కొత్త బుల్లెట్ ఫ్రూప్ స్కార్పియో కారును సమకూర్చి..ఆయన ఉన్న పరిసరాలు మొత్తం బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు.
ఎస్సై, ఏఆర్ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు, మరో ఎనిమిదిమంది ప్రత్యేక అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు.. వ్యవసాయ క్షేత్రంలోకి ఎవరినీ అనుమతించటం లేదు. తమ అధినేత ప్రాణాలకు ముప్పు ఉందని.. చంపేందుకు బెంగళూరులో ప్లానింగ్ జరుగుతుందని టీఆర్ఎస్ నేతలు హరీశ్, ఈటెల రాజేందర్ ఆరోపించిన నేపథ్యంలో ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టింది.