ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 8 August 2013

    ఊరిస్తున్న 'అత్తారింటికి దారేది' రిపోర్ట్స్‌

    Fans Waiting for Attarintiki Daredi Movie Release
    సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తయిపోయి, ఇంకో అయిదు రోజుల్లో సినిమా విడుదలైపోతుందని ఎదురు చూస్తుండగా, ఆ సినిమా నిరవధికంగా వాయిదా పడిందని తెలియడం కంటే అభిమానులకి మరో చేదు వార్త ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా పడిన 'అత్తారింటికి దారేది' చిత్రం దసరాకి కానీ రాదేమోనని ఊహాగానాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా కుదురుకున్న తర్వాతే సినిమా రిలీజ్‌ చేయమని పవన్‌కళ్యాణ్‌ క్లియర్‌గా చెప్పేశాడట.

    అయితే ఇలా ఎప్పుడు వస్తుందో తెలీని విధంగా వాయిదా పడిపోయిన సినిమాకి వినిపిస్తున్న రిపోర్ట్స్‌ మాత్రం అభిమానుల్ని ఊరడిస్తూ, ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. 'అత్తారింటికి దారేది' స్పెషల్‌ స్క్రీనింగ్‌ చూసిన వారు ఇది ష్యూర్‌షాట్‌ హిట్‌ అని చెబుతున్నారు. పవన్‌, బ్రహ్మానందంల కామెడీ ఈ చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుందట. పాటలన్నీ తెరపై బ్రహ్మాండంగా ఉన్నాయట. పవన్‌కళ్యాణ్‌ మార్కు స్టయిల్‌, మేనరిజమ్స్‌ ఈ చిత్రంలో చూడవచ్చునని, తనదైన శైలి కథలో పవన్‌కళ్యాణ్‌ స్టయిల్‌ని మిక్స్‌ చేసి త్రివిక్రమ్‌ అద్భుతమైన సినిమా తీర్చిదిద్దాడని టాక్‌ వినిపిస్తోంది. ఇలాంటి రిపోర్ట్స్‌ వింటుంటే ఆనందంగా ఉన్నా కానీ సినిమా రావడం లేదనే కలత కూడా అభిమానుల్ని కొద్దిగా తొలిచేస్తోంది పాపం.

    Tollywood

    Bollywood

    Kollywood