తేజ దర్శకత్వం వహించిన చిత్రం 1000 అబద్దాలు. సాయిరామ్ శంకర్, ఎస్తేర్ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని తొలుత ఆగస్టు 15న విడుదల చేద్దామనుకొన్నారు. అత్తారింటికి దారేది సినిమారావడం లేదని తెలిసి వారం రోజులు ముందుగా అంటే.. ఈనెల 9న తీసుకొద్దామని విశ్వప్రయత్నాలు చేశారు.
అయితే సమయాభావం వలన అది సాధ్యం కాలేదు. దాంతో ముందు అనుకొన్నట్టు పంద్రాగస్టుకే ఈ సినిమా రానుంది. వారం రోజుల వ్యవధి ఉంది కాబట్టి, ప్రచార కార్యక్రమాలకూ తగిన సమయం దొరికినట్టవుతుంది. అందుకే తేజ తొందరపడకుండా ఈ చిత్రాన్ని 15న తీసుకొద్దామని ఫిక్సయ్యారు. దాంతో ఈ శుక్రవారం బాక్సాఫీసు దగ్గర ఒక్క తెలుగు సినిమాకూడా రావడం లేదని తేలింది.