మహిళను రక్షించే భాగంలో తనవంతు సహాయాన్ని అందించాడు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దారుణాలు కు వ్యతిరేకంగా పురుషులలో చైతన్య తీసుకొచ్చేందుకు ‘మర్ధ్’పేరుతో రూపొందుతున్న ప్రచారానికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. రచయిత జావెద్ అక్తర్ రాసిన కవితకు మరాఠీ భాషలో సచిన్ తన వాయిస్ ఇచ్చాడు. తెలుగులో ఈ కవితకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందించిన సంగతి తెలిసిందే.
జావెద్ అక్తర్ రాసిన కవిత తెలుగులో క్రింది విధంగా సాగుతోంది..
ఎవరి కళ్ళలో అయితే సంస్కారం సూర్య కాంతిలా మెరుస్తుందో ఎవరి మాట మన్ననగా ఉంటుందో, ఎవరి మనసు మెతగా ఉంటుందో ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో ఎవరికీ ఆడవాలంటే హృదయంలో అభిమానం సమాజంలో గౌరవం ఉంటాయో ఎవరు వారి శరీరానికి మనసుకి ఆత్మ కి విలువనిస్తారో వారి ఆత్మ గౌరవానికి తోడు గా నిలుస్తారో ఎవరు మగువ కూడా మనిషే అని ఒక క్షణం మర్చిపోరో,స్త్రీ కి శక్తి ఉంది గుర్తింపు ఉంది గౌరవం ఉండాలి అని ఎవరు మనస్పూర్తిగా అనుకుంటారో ఎవరికీ దేగారగా ఉంటే వారికీ ప్రమాదం దూరంగా పారిపోతుందని వారికీ నమ్మకం ఉంటుందో అలాంటివాడు స్త్రీ కి నిజమిన స్నేహితుడు సహచరుడు ఆత్మీయుడు ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు.