ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Saturday, 24 August 2013

    తాప్సీకి తమిళుల దెబ్బ

    తాప్సీకి తమిళుల దెబ్బ
    ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీల‌లో ఎక్కడ‌లేని ఆచారాన్ని ఒక్క కోళీవుడ్‌లోనే చూస్తుంటాం. ఇక్కడి ప్రేక్షకులకి సిని న‌టులు న‌చ్చితే, వారికి ఏకంగా గుడినే కట్టేస్తారు. ఇత‌ర ఇండ‌స్ట్రీల‌లో అక్కడ‌క్కడా చూస్తున్నా త‌మిళ‌నాడులో మాత్రం ప్రతి సంవ‌త్సరం చూస్తూనే ఉంటాం. అందుకే ప్రేక్షకుల మ‌న‌స్సును బాధ క‌లిగించే విధంగా ఏ యాక్టర్ కూడ ప్రవ‌ర్తించ‌డు. ప్రేక్షకుల‌కు న‌ట‌లు దేవుళ్ళయితే, న‌టులు ప్రేక్షకుల‌నే కాక త‌మిళ‌నాడు సంసృతికి గౌర‌వించే సాంప్రదాయ‌తను క‌లిగి ఉండాలి. నేటివిటి ఫీలింగ్‌ను న‌ర‌న‌రాల్లో పుణికిప‌చ్చుకుంటారు త‌మిళ‌తంభీలు. మ‌రి అలాంటి త‌మిళ‌తంభీల‌ను హ‌ర్ట్ చేసే విధంగా తాప్సీ ప్రవ‌ర్తించింది. మేట‌ర్ చిన్నదైనా తాప్సీను ఓ కంట క‌నిపెడుతూ వ‌స్తున్నారు త‌మిళ‌ప్రేక్షకులు.

    రీసెంట్‌గా త‌మిళ‌నాడు ఎయిర్‌పోర్ట్ గురించి తాప్సీ కామెంట్ చేసింది. ఇక్కడ ఎప్పుడు వ‌చ్చినా చెత్త క‌నిపిస్తూనే ఉంటుంది అని ఎయిర్‌పోర్ట్‌పై కామెంట్ చేసింది. గ‌త నాలుగు నెల‌ల క్రితం మ‌రో స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఆడియో ఫంక్షన్స్‌ని ఎంట‌ర్‌టైన్‌గా జ‌రిపేది ఒక్క టాలీవుడ్‌లోనే అంటూ కామెంట్ చేసింది. కోళీవుడ్ ఇండ‌స్ట్రీపై ఉన్న కోపాన్ని ఈ విధంగా సిని అభిమానుల మీద చూప‌టం స‌రికాద‌ని కొంత మంది తాప్సీకు చెప్పిన‌ప్పటికి తాప్సీ వినిపించుకోవ‌డం లేదంట‌. త్వర‌లోనే లారెన్స్‌,తాప్సీ కాంబినేష‌న్‌లో రాబోతున్న ముని3 మూవీలో తాప్సీను ఏ విధంగా టార్గెట్ చేసుకుంటారో అని కోళీవుడ్ విశ్లేష‌కులు సైతం తాప్సీ కామెంట్స్‌పై సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నారు. అయినా త‌మిళ ప్రేక్షకుల‌కు ద‌గ్గరైతే గుడి క‌డ‌తారు కాని, ఇలా చివాట్లు పెడితే తోలు పీకుతార‌ని కూడ తెలిదేమో తాప్సీకి.

    Tollywood

    Bollywood

    Kollywood