డైలాగ్ కింగ్ సాయికుమార్ చిరంజీవి నటించిన ‘ఛాలెంజ్’ సినిమాలో చేసిన పాత్ర చాలా చిన్నది. కానీ ఆ సినిమా గుర్తుకు వచ్చినప్పుడల్లా సాయికుమార్ అందరికీ గుర్తుకు వస్తాడు. అటువంటి సాయికుమార్ అదే చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమాలో చాల ఛాలెంజింగ్ పాత్ర చేసాడు అంటున్నారు. ఈ సినిమాలో సాయికుమార్ గొంతుకతో పాటు కళ్ళు కూడా మాట్లాడుతాయని ఈ సినిమా రషస్ చూసినవారు అంటున్నారు. ఈ సినిమాలో ఎక్కువ షాట్స్ సాయికుమార్ కళ్ళమీదే ఎక్కువగా తీసారట.
చెర్రీ కి సవాల్ విసిరే పాత్రగా సాయికుమార్ పాత్ర ఇములో ఉంటుందని ‘మగధీర’ సినిమాకు శ్రీహరి పాత్ర ఎటువంటి టర్నింగ్ పాయింట్ ఇచ్చిందో ‘ఎవడు’ సినిమాకు సాయికుమార్ పాత్ర అటువంటిదని అంటూ సాయికుమార్ పాత్ర పై ప్రశంసలు కురిపిస్తున్నాయి ఫిలింనగర్ వర్గాలు. సాయికుమార్ చేర్రీల మధ్య జరిగే ఛాలెంజ్ చూడాలంటే చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగష్టు లో విడుదలకబోతున్న ‘ఎవడు’ సినిమా వచ్చే వరకు వేచి ఉండాలిసిందే...