మెడలో మూడు ముళ్లు వేయించుకోకుండానే మగాడితో కలిసి కాపురం పెడతాననంటోంది తాప్సి. రెండేళ్లు సహజీవనం చేశాకే పెళ్లి ముచ్చట గురించి ఆలోచిస్తానని చెబుతోంది. ఎంత మగాడితో కలిసి కాపురం చేసినా... తప్పు మాత్రం జరగకుండా జాగ్రత్త పడతానని అంటోంది. అమ్మడు మన వివాహ వ్యవస్థపై ఏమాత్రం నమ్మకం లేదని చెబుతోంది. అందుకే ఇలా సహజీవనం గురించి ఆలోచిస్తానంటోంది.
ఇటీవల ఓ ఇంటర్వూలో తాప్సి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. తాప్సి వ్యాఖ్యలపై సంప్రదాయవాదులు భగ్గుమంటున్నారు. రెండేళ్లు కలిసి జీవించాకే మగాడి మనసు పూర్తిగా అర్థం చేసుకొంటా.నచ్చితే ఆ తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అంటోంది. ముక్కూ మొహం తెలియనివాడితో పెళ్లి చేసుకోవడం కంటే ఇది ఉత్తమం కదా అని తాప్సి సెలవిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఇదివరకు కూడా ఈ తరహా వ్యాఖ్యలు కొన్ని చేసింది. మరో పదేళ్ల తర్వాత దేశం విడిచిపెట్టి వెళ్లిపోతానని, వేరొక దేశంలో నివాసం ఏర్పాటు చేసుకొంటానని చెప్పింది. ఎంతైనా తాప్సిది బోల్డ్ నేచర్ కదా...