వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్ సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి చంచల్ గూడ జైలు నుంచి రేపు ఉదయం విడుదలవుతారని ఆయన తరపు న్యాయవాది అశోక్ రెడ్డి చెప్పారు. నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు జగన్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ రోజు సమయం మించిపోయినందున జగన్ రేపు విడదల అవుతారని చెప్పారు. జగన్ హైదరాబాద్ వదిలి వెళ్లరాదని కోర్టు షరతు విధించింది. అలాగే రెండు లక్షల రూపాయల విలువైన రెండు పూచీకత్తులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. జగన్ తరపు న్యాయవాదులు పూచీకత్తులను రేపు సమర్పిస్తారు.
Search Terms: YS Jagan, CBI Court, వైఎస్ జగన్, సిబిఐ కోర్టు
Search Terms: YS Jagan, CBI Court, వైఎస్ జగన్, సిబిఐ కోర్టు