ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Saturday, 28 September 2013

    డిసైడ్ అయిన ముఖ్యమంత్రి ఊస్టింగ్

    డిసైడ్ అయిన ముఖ్యమంత్రి ఊస్టింగ్
    రాష్ట్ర రాజకీయాలను కుదుపేసే వార్త, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పదవి నుంచే కాదు పార్టీ నుంచే ఊస్టింగ్ చేస్తున్నారట. ఈ వదంతులు రాష్ట్ర రాజకీయాల్లో శనివారం ఉదయం దావానంలా వ్యాపించాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కాని దిగ్విజయ్ సింగ్ వాఖ్యలు మాత్రం కొంత ఈ వార్తలకు బలం చేకూర్చేలానే ఉన్నాయంటున్నారు. శుక్రవారం సిఎం విలేఖరుల సమావేశానికి ముందు సాఫ్ట్ గా మాట్లాడిన దిగ్విజయ్ సింగ్ తాజాగా సీరియస్ కావడమే ఈ సంకేతాలకు కారణం అంటున్నారు.

    సిడబ్ల్యూసి నిర్ణయం ఫైనల్, దానిని దిక్కరించి మాట్లాడే హక్కు పార్టీలో ఎవరికి ఉండదు, పార్టీలో అంతర్గతంగా చర్చించి, అందరి ఆమోదం పొందడంతో పాటు, రాష్ట్రంలోని అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నతర్వాతే రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నాం అన్నారు. ముఖ్యమంత్రి ఈ విషయంపై సీరియస్ గా బరస్ట్ అయ్యాడు అంటున్నారు, దానిని నిషితంగా పరిశీలించాల్సి ఉంది, అదే కనుక నిజమైతే ఉపేక్షించేది లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు.

    మరో వైపు ముఖ్యమంత్రి కూడా తనకు పదవి ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం, అవసరమైతే పదవిని కూడా వదులుకుంటానని ఖరాఖండిగా చెప్పాడు. అంటే ఆయన ఇలా జరుగుతుందని తెలిసే అన్నింటికి తెగించి విలేఖరులు సమావేశంలో కాంగ్రెస్ హైకమాండ్ పై విరుచుకు పడ్డాడని సమాచారం. ఇప్పటికే కిరణ్ సోదరుడు అందుకు తగ్గ రాజకీయ ఏర్పాట్లు కూడా చేసాడన్న వార్తలు కూడా వెలుబడ్డాయి. అందుకే సిఎం ఊస్టింగ్ ఖాయం అంటున్నారు. అంతే కాదు మరోవైపు రాష్ట్రపతిపాలన విధించే దిశగా కూడా కేంద్రం అడుగులు వేస్తోందన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ వార్తలు నిజమేనేమోనన్న దానికే బలం చేకూరుతోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

    Tollywood

    Bollywood

    Kollywood