ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Saturday, 28 September 2013

    ప్రభాస్ నిశ్చితార్ధం జరిగిపోయింది

    ప్రభాస్ నిశ్చితార్ధం జరిగిపోయింది
    ప్రభాస్ రాజమౌళికి ఇచ్చిన మాట తప్పాడు రాజమౌళి సమక్షంలోనే తన పెళ్లి నిశ్చితార్ధం చేసుకున్నాడు. అయితే ఇది నిజ జీవితంలో కాదు ‘బాహుబలి’ సినిమా సెట్లో. ప్రస్తుతం ‘బాహుబలి' సినిమా షూటింగ్  రామోజీ  ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈసినిమా షూటింగ్ కోసం 2.5 కోట్ల ఖర్చుతో భారీ దర్బార్ సెట్ వేసి ‘బాహుబలి’ సినిమా షూటింగ్ ను రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నిన్న ఈ సెట్ లో ప్రభాస్ అనుష్కల నిశ్చితార్దం సీన్ ను మన జక్కన్న చిత్రీకరించారట.

    ఈ షూటింగ్ లో ప్రభాస్, అనుష్కలతో పాటు రాజమాత రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, అడవిశేషులు కూడా పాల్గొని ప్రభాస్ ను ఆశీర్వదించినట్లు గా తెలుస్తోంది. దాదాపు 80 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈసినిమా షూటింగ్ ఫోటోలను కూడా బయటకు రానివ్వకుండా రాజమౌళి కట్టడి చేసినట్లు తెలుస్తోంది. ఆఖరుకు ప్రభాస్ అనుష్కలను దగ్గర కూడా సెల్ ఫాన్స్ లేకపోవడంతో పాపం యూనిట్ సభ్యులు అంతా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కాలం గడుపుతున్నారని టాక్.

    తెలుగు సినిమా రంగంలోనే భారీ సినిమా కాబట్టి ఆ మాత్రం త్యాగాలు మన ప్రభాస్, అనుష్కలు చేయవలసి వస్తోంది అనుకోవాలి. వచ్చే సంవత్సరంలో జరగబోయే ప్రభాస్ నిశ్చితార్ధానికి సినిమా ట్రైలర్ లా సెట్లో జరిగిన ఈ నిశ్చితార్ధo ప్రభాస్ కు మంచి జోష్ ఇస్తుంది అని అనుకోవాలి...

    Tollywood

    Bollywood

    Kollywood