ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Monday, 2 September 2013

    సీమాంధ్ర మంత్రుల సీల్ చిరిగింది

    సీమాంధ్ర మంత్రుల సీల్ చిరిగింది
    సీమాంధ్ర మంత్రుల సీల్ చిరిగింది, ఇన్నాళ్లు రాజీనామాలు చేయమంటే, మేం చేస్తే రాష్ట్రం ముక్కులు చేయడాన్ని ఆపలేం, మేం అధికారంలో ఉంటేనే ఢిల్లీ పెద్దలను అడ్డుకోగలం, వారిని సమైక్యం కోసం ఒప్పించగలం, ఆపనిలోనే ఉన్నాం, తమ వాదన బలంగా సోనియాకు వివరించాం, ఆమె వైఖరిలో మార్పు వస్తోందన్న సీల్ వేసుకుని రాజీనామాలు చేయకుండా తప్పించుకున్నారు. వారు వేసుకున్న సీల్ ను హోంమంత్రి షిండే సోమవారం చించేసారు. దీంతో వారి పరిస్తితి డోలాయమానంలో పడింది.

    మరోవైపు వారు రాజీనామాలు  చేయాలని ఏపిఎన్జీఓలు ఆల్టిమేటం ఇస్తే బాబ్బాబు  ఈనెల రెండో తేది వరకు ఆగండి, మళ్లీ సమావేశం పెట్టుకుని చర్చించి రాజీనామాలు చేస్తాం అన్నారు. ఖచ్చితంగా అదే రోజు మీరేం చేస్తారో చేసుకోండి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది, 20 రోజుల్లోనే క్యాబినెట్ నోట్, నాలుగు నెలల్లోనే తెలంగాణ ఏర్పాటు పూర్తవుతోంది అన్నారు షిండే.

    తాజాగా మంత్రి పితానిని సమైక్యవాదులు జిల్లాపరిషత్ సమావేశానికి వచ్చిన సంధర్బంగా అడ్డుకున్నారు. పోలీసులు సహాయంతో ఆయన బయటపడ్డారు, రాజీనామా చేసి ఆమోదించుకుని రానంత వరకు జిల్లాలోకి అడుగుపెట్టనీయం అని సమైక్యవాదులు ఈ సంధర్భంగా స్పష్టం చేసారు. ఈ మద్య తులసీరెడ్డిపైనేతే దాడికే దిగారు. ఇలాంటి పరిస్తితుల్లో సీమాంద్ర కేంద్రమంత్రుల పరిస్తితి ఆగమ్యగోచరంగా తయారైనట్టేనని, వారు ఏంచేస్తారనేది వేచిచూడాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

    Tollywood

    Bollywood

    Kollywood