ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 5 September 2013

    పోలీసుల అదుపులో హైదరాబాద్

    పోలీసుల అదుపులోకి హైదరాబాద్ వెల్లిపోయింది, చీమ చిటుక్కుమన్నా పోలీసులు స్పందించే విదంగా భద్రతా చర్యలు చేపట్టారు. పారామిలటరీ బలగాలు, రాపిడ్ ఆక్షన్ ఫోర్స్ ను మొహారించారు. దాదాపు 30 వేల మంది అదనపు పోలీసుబలగాలను రాజధానిలో ఏర్పాటు చేసారు. ఏపిఎన్జీఓలు నిర్వహించనున్న ఎల్.బి. స్టేడియాన్ని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

    ముందుగా వచ్చిన వారికి ముందుగా అనుమతి అన్న విదానాన్ని ఏపిఎన్జీఓల విషయంలో పాటించామని సిపి అనురాగ శర్మ చెప్పారు. హైదరాబాద్ లో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని చెప్పారు. గురువారం ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ఏపిఎన్జీఓ ల సభకు 19 షరతులు విదించి అనుమతి ఇచ్చామన్నారు. ఈ నెల 8న కావాలంటే సభకు తెలంగాణ వారికి అనుమతిస్తామని తెలిపారు. ఉద్యోగులు తప్ప వేరెవరు హాజరు కావడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేసారు.

    ఏ ఒక్క సంఘటన జరిగినా ఊరుకునేది లేదని చెప్పారు. మాకు కొంత సమాచారం ఉందని ఆమేరకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించకూడదని ఆయన తెలిపారు. ఐడి కార్డులేకుండా ఎవరిని సభకు అనుమతించమని చెప్పారు. కాని అనుమతి లేకపోయినా ర్యాలీ చేసి తీరుతామని టిజేఏసి, టి విద్యార్థి జేఏసి లు ఇప్పటికే హెచ్చరించారు. దీంతో హైదరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    Tollywood

    Bollywood

    Kollywood