ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Saturday, 28 September 2013

    పవన్ కళ్యాణ్ తాతకు షాకింగ్ మెసేజ్ లు

    పవన్ కళ్యాణ్ తాతకు షాకింగ్ మెసేజ్ లు
    నిన్న విడుదలైన పవన్ ‘అత్తారింటికి దారేది’ ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని ప్రస్తుతం ఇక ఈసినిమా ఎన్ని కోట్లు కొల్లకొడుతుంది అనే లెక్కల పై నడుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తాతగా లక్ష కోట్ల అధిపతిగా నటించిన బోమన్ ఇరానీకి మాత్రం ఈసినిమా నిన్న విడుదల అయింది అన్న విషయం తెలియదట. ఈ సినిమా పైరసీ వ్యవహారంలో చిక్కుకుంది అన్న విషయం బోమన్ కు తెలిసింది కానీ ఈసినిమా నిన్న విడుదలైంది ఇంత సూపర్ హిట్ అయింది అన్న విషయం ఈయన దృష్టికి రాలేదట దీనికి కారణం ఆయన ప్రస్తుతం దుబాయ్ దేశంలో ‘హ్యాపీ న్యూఇయర్’ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడమే కారణం అంటున్నారు.

    అదీకాక తెలుగు సినిమాలు దుబాయ్ లో వెంటనే విడుదలకావు అందువల్ల పవన్ తాత పాత్ర పోషించిన బోమన్ కు తన మనవడి విశేషాలు ఏమి తెలియలేదు. కానీ వరుస పెట్టి ఆయన సెల్ ఫోన్ కు వస్తున్న అభినందన సందేశాలు చూసుకుని బోమన్ షాక్ అయ్యాడట. అంతేకాకుండా ఈ సినిమాకు మంచి రివ్యూస్ రావడం తాను మొట్టమొదటిసారిగా నటించిన తెలుగు సినిమా ఇంత సూపర్ హిట్ కావడం బోమన్ ను జోష్ లో ముంచేసిందట. మంచి నటుడుగా పేరుగాంచిన బోమన్ కు ఈసినిమా సూపర్ హిట్ తో టాలీవుడ్ బిజీ యాక్టర్ అవ్వడం ఖాయం అని అంటున్నారు.. 

    Post Comments

    Tollywood

    Bollywood

    Kollywood