ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Saturday, 28 September 2013

    పవనిజమ్ మోజులో లాఠీ దెబ్బలు

    Police juloom at Attarintiki Daredi Theaters
    తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ సినిమా కోసం పవన్ వీరాభిమానులు  లాఠీ దెబ్బలను సైతం ఓర్చుకుంటు ‘అత్తారింటికి దారేది’ ని తమ బుజాలపై మోస్తున్నారు. పవర్ స్టార్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం విడుదల రోజే చూడాలని అభిమానులు పిచ్చి తాపత్రయoతో రాష్ట్రంలో అనేక చోట్ల  ఈసినిమా టికెట్ల కోసం పోటీ పడి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్న సంఘటనలు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అనేకం జరిగాయి అనే వార్తలు వస్తున్నాయి.

    ఈ వారంతంలో పవన్ సినిమాను ఏదోవిధంగా చూద్దామని కోరికతో రాష్ట్రంలోని యూత్ అంతా ఈ సినిమా టిక్కెట్లు సంపాదించడమే జీవిత ధ్యేయంగా భావిస్తూ ధియేటర్ల చుట్టూ ప్రధక్షణాలు చేస్తున్నారు. ఈ సినిమా విడుదలైన రెండవరోజు కూడా ఇదే పరిస్థితి. రాజకీయ ఉద్యమాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ‘అత్తారింటి’ సినిమా కబుర్లతోనే యూత్ వీక్ ఎండ్ ఎంజాయ్ చేస్తోంది.

    ఈ సినిమాకు టిక్కెట్లు దొరికితే లాటరీ తగిలినంత ఆనంద పడిపోతున్నారు యూత్. పవనిజం మోజు ఈ సినిమాను ఎరేంజ్ హిట్ కు తీసుకు వెళుతుందో తెలియాలి అంటే మరి కొద్దిరోజులు ఆగాలి. పవన్ వన్ మేన్ షోగా నడుస్తున్న అత్తారింటి క్రేజ్ టాలీవుడ్ లో టాపిక్ ఆఫ్ ది డే గా మారింది. 

    Tollywood

    Bollywood

    Kollywood