ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Tuesday, 15 October 2013

    తాట తీస్తానంటున్న పవన్ కళ్యాణ్

    Taata Teesta, Pawan Kalyan, Pawan Kalyan Warn Taata Teesta
    పవన్ కళ్యాణ్ కి కోపం వచ్చింది. అందుకే... తన జోలికి వస్తే తాట తీస్తానని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేశాడు. ఆ విషయం చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చను లేవనెత్తింది. సోమవారం రాత్రి హైదరాబాద్ లో `అత్తారింటికి దారేది` థాంక్స్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆవేశంతో మాట్లాడారు.

    పైరసీ ఉద్దేశ పూర్వకంగానే చేశారని, వాళ్ళను వదిలిపెట్టే అవకాశమే లేదని హెచ్చరించాడు పవన్ కళ్యాణ్. ``ప్రేక్షకులు ఎవ్వరూ పైరసీ ని చూడలేదు. చిత్ర పరిశ్రమలో ఉంటూ, పరిశ్రమపైనే ఆధారపడిన ప్రముఖులే ఐ పాడ్ లలో, డెస్క్ టాప్ లలో ఆ సినిమాని చూశారు. చూడడమే కాదు. `సినిమా చాలా బాగుంది మీకేం భయం లేదు` అంటూ ఫోన్లు కూడా చేశారు. అప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అంత జరిగినా కూడా నేను, త్రివిక్రమ్ ధైర్యం కోల్పోలేదు. దానికి కారణం అభిమానులే. వారు మా వెనక ఉన్నారనే భరోసా ఉండడంతోనే మేం ధైర్యంగా ఉన్నాం. అభిమానులు లేకపోతే నేను లేను.  అమ్మానాన్న, అన్నయ్య, వదినల తర్వాత నాకు అభిమానులే. వారికోసం నేను ప్రాణాలైనా ఇస్తా. `అత్తారింటికి దారేది` పైరసీ వెనక బలమైన కుట్ర ఉంది. వచ్చే ఏడాది దాని వెనక ఎవరున్నారన్న విషయం చెబుతాను. నాకు, త్రివిక్రమ్ కి సర్దుకుపోయే గుణం ఎక్కువ. మా సహనాన్ని చేతగాని తనంగా మాత్రం భావించకూడదు. నేను ఎంతవరకైనా భరిస్తా. సహనం కోల్పోతే మాత్రం వాళ్ళ తాట తీసే దాకా వదిలి పెట్టను`` అన్నార పవన్ కళ్యాణ్. ఆయన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. పైరసీ వెనక కారణం ఎవరన్న విషయం గురించి ఇప్పుడు పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

    Tollywood

    Bollywood

    Kollywood