సినిమా పూర్తయిన తర్వాత నేను పెద్దగా మాట్లాడను. కలెక్షన్ల గురించి పట్టించుకోను. అందరికీ నచ్చడం ఆనందాన్నిచ్చింది. త్రివిక్రమ్ గారివల్లే ఈ సినిమా గురించి ఎక్కువగా వింటున్నాను….నేను, త్రివిక్రమ్ గారు పెరిగిన వాతారవరణం అయ్యుండొచ్చు…మేం మాట్లాడుకునే మానవ సంబంధాలు, చదివిన పుస్తకాల్లోంచి పుట్టిందే ఈ కథ. సినిమా ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు. అత్త అనే మాటకు గౌరవం లేకుండా పోతోంది. అబ్యూస్ డ్ టర్మ్ గా వాడుతున్నారు. అందుకే అత్త పాత్ర మీద సినిమా అయితే బాగుంటుందనిపించింది. మా ఇద్దరికి పాత సినిమాలంటే ఇష్టం. అలాంటి సినిమాలు చేయలేమా.. ఎప్పుడూ యాక్షన్ కథలేనా… అనిపించింది. ఆలాంటి కథలు రాయగలిగే, తీయగలిగే శక్తి త్రివిక్రమ్ కి ఉందని నమ్మాను. రియల్ లైఫ్ లో ఆయన అద్భుతాలు మాట్లాడుతారు. అందుకే ఈ కథ చేయమని పుష్ చేశాను. నేను ఆనందం వెతుక్కున్నాను. నాది కాని పాత్రలు చేయమంటే చేయలేను. అలాంటి క్యారెక్టర్స్ ఆలోచిస్తేనే ఆలసట వచ్చేస్తుంది.
నేను రివ్యూలు చదవను. బలమైన నమ్మకంతో విశ్వాసంతో సినిమా చేస్తాం. ఏం తప్పులు చేశామో మాకు తెలిసిపోతుంది. రివ్యూలు చదవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. సినిమాను నేను నమ్మాను అందుకే సినిమా ఇప్పటికీ చూడలేదు…
నేను రివ్యూలు చదవను. బలమైన నమ్మకంతో విశ్వాసంతో సినిమా చేస్తాం. ఏం తప్పులు చేశామో మాకు తెలిసిపోతుంది. రివ్యూలు చదవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. సినిమాను నేను నమ్మాను అందుకే సినిమా ఇప్పటికీ చూడలేదు…