ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Tuesday, 15 October 2013

    గుట్టు చప్పుడు కాకుండా వై యెస్ ఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు

    గుట్టు చప్పుడు కాకుండా వై యెస్ ఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు
    మహబూబ్ నగర్ / నాగర్ కర్నూల్: మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ మండలంలో సోమవారం రోజు రాత్రి మండల కార్యాలయం ప్రక్కన ఉన్న వై యెస్ ఆర్ విగ్రహానికి గుట్టు చప్పుడు కాకుండా నిప్పుపెట్టడం చాలా మంది వై యెస్ ఆర్ అభిమానుల్లో కలకలం రేపింది.

    వై యెస్ ఆర్ విగ్రహానికి నిప్పు పెట్టడం ఫై చాలా మంది నిరసనలు తెలిపారు. మహానుభావుడు వై యెస్ ఆర్ చేపట్టిన పథకాలు, ఆయన చేసిన మేలు, ఇవన్నీ ఇంకా ఎవరూ మరవలేదని ప్రజలు, అభిమానులు చాలా భాధకు గురయ్యారు. ఇలా అర్ధాంతరంగా ఇలాంటి పని చేసిన వాళ్ళని కనిపెట్టాలని ప్రజలు మరియు అభిమానులు కోపానికి గురయ్యారు.

    మహానేత వై యెస్ ఆర్ అభిమానానికి తెలంగాణా, ఆంద్ర, రాయలసీమ అనే భేదాలు ఏమి లేవని, ఆయన ఒక మంచి మనిషని, అదీ కాక ఆయన రైతుల కోసం ఎంతో చేసారని, సామాన్య రైతులు సైతం బాధకు గురయ్యారు.

    ఇలాంటి పనికి ఒడిగట్టిన వాళ్ళని పట్టుకుని చట్ట ప్రకారం శిక్షను విధించాలని ప్రజలు ఆక్రోశంతో పెద్దఎత్తున నినాదాలు చేశారు. మూడోకంటికి తెలీకుండా, ఇలా దొంగచాటుగా నిప్పంటించడం, ఏదో సాధించామని సంభరపడడం దొంగలకే సాధ్యమని, దమ్ముంటే ముందుకొచ్చి చేయమని వై యెస్ ఆర్ అభిమానులు, వై సి పి కార్యకర్తలు కోపంతో చెప్పారు.

    ఆంధ్రా, రాయల సీమ, తెలంగాణ లో కూడా వై యెస్ ఆర్ అభిమానులు చాలా మంది ఉన్నారని , వై సి పి ని ఓడించడానికి సాధ్యం కాక ఇలాంటి పనులకి ఒడిగడుతున్నారని తెలంగాణా వై సి పి అభిమానులు,నాయకులు ఆక్రోశానికి గురయ్యారు.

    ఇలాంటివి మళ్లి జరగకుండా చూడాల్సిన భాద్యత వై యెస్ ఆర్ ని,  వై సి పి పార్టీని అభిమానించే ప్రతీ ఒక్కరికి  ఉందని, వై సి పి కార్యకర్తలు చెప్పారు.

    Tollywood

    Bollywood

    Kollywood