ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Tuesday, 15 October 2013

    ప‌వ‌న్ పై కుట్ర డిస్ట్రిబ్యూట‌ర్ పనేనా?

    ప‌వ‌న్ పై కుట్ర డిస్ట్రిబ్యూట‌ర్ పనేనా
    టాలీవుడ్ సంసృతి ఎంత‌టి విష‌మంగా మారిందో అత్తారింటికిదారేది లీక్డ్ వీడియోను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. మొన్నటి వ‌ర‌కూ ఇది లీక్డ్ వీడియో అని సినీ అభిమానుల‌కి తెలుసు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఇది లీక్డ్ వీడియో కాదు, కుట్ర పూరితంగా జ‌రిగింది అని చెప్పడంతో, ఆ వ్యక్తి ఎవ‌రై ఉంటారు అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ క‌లుగుతున్నాయి. ప‌వ‌న్‌కి ఆ వ్యక్తులు ఎవ‌రో తెలిసినా, పైకి చెప్పకుండా వాళ్ళుకు బుద్ది చెప్పేందుకు అప్పుడే చ‌ర్యలను మొద‌లుపెట్టాడు. ఇంత‌కీ ఆ వ్యక్తి ఎవ‌రై ఉంటారు అనేదానిపై చాల మంది పేర్లు పైకి వినిపిస్తున్నాయి.

    ఇందులో టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన బ‌డా డిస్ట్రిబ్యూట‌ర్ కూడ ఉన్నాడ‌ని తెలుస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో ప‌వ‌న్ మూవీలకు పోటీగా వ‌స్తున్న ఆ డిస్ట్రిబ్యూట‌ర్, ఈ త‌ర‌హా కుట్రకు పాల్పడి ఉంటాడ‌ని టాలీవుడ్‌లో ప‌లుర‌కాల మాట‌లు వినిపిస్తున్నాయి. ప‌వ‌న్ అత్తారింటికి దారేది మూవీ ఒక ప్రాంతానికి సంబంధించిన డిస్ట్రిబ్యూష‌న్ రైట్స్ త‌న‌కు ద‌క్కలేద‌ని, అందుకే ఈ త‌ర‌హా కుట్రను వెనుక ఉండి చేయించి ఉంటాడ‌ని అంటున్నారు. ఇందులో ఎంత వ‌ర‌కూ నిజం ఉందో లేదో తెలియ‌దు కాని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఆ వ‌క్తిని అలాగే దాన్ని ప్రొత్సాహ‌ప‌రిచిన వ్యక్తుల‌ను వ‌దిలేదిలేద‌ని త‌న సిద్ధాంతంపు మాట‌ల‌తో ఘూటుగానే స‌మాధానం చెప్పాడు. ఇంత వ‌ర‌కూ వ్యవ‌హారం వ‌చ్చింది కాబ‌ట్టి, ఆ తెర‌వెనుక ఉన్న కుట్రదారులు ఎవ‌రు అనేది త్వరలోనే బ‌య‌ట‌కు తెలిసిద్దని టాలీవుడ్ అంటుంది.

    Tollywood

    Bollywood

    Kollywood