ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Tuesday, 15 October 2013

    కులాల కుమ్ములాటలు మొదలు

    కులాల కుమ్ములాటలు మొదలు
    విభజన పేరుతో తెలుగువారి మధ్య కుమ్ములాటలు పెట్టిన సోనియమ్మ మరో గేమ్ కు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు ప్రాంతీయవాదంతో కొట్టుకు చచ్చిన తెలుగోళ్లు ఇకపై కులాల కుమ్ములాటలో బలిపశువులుగా మారే ప్రమాదం పొంచి ఉంది. తెలంగాణ ప్రాంతానికి.. హైదరాబాద్ తోకూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకు పచ్చజెండా ఊపిన సోనియమ్మ అంటే సీమాంధ్ర ప్రజానీకం ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

    రానున్న ఎన్నికల్లో తమ సత్తా చాటి... కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు చేద్దామని ప్రతిన పట్టి మరీ ఉన్నారు. విభజన వల్ల చిన్నచిన్నచికాకులు తప్పవని మాత్రమే అనుకున్న సోనియమ్మకు భారీ ఉద్యమం బెంబేలెత్తేసింది. అలా అని విభజన నిర్ణయం మీద వెనక్కి వెళితే.. తెలంగాణలో ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు. అందుకే.. సోనియమ్మ సరికొత్త స్కీం స్టార్ట్ చేయనున్నారు. విభజన నేపథ్యంలో సీమాంధ్రులు కోరుకున్నవి ఇవ్వటంతో పాటు.. అక్కడి వారు ఎవరూ ఊహించని బహుమతి ఇవ్వనున్నారు.

     సీమాంధ్రలో బలమైన సామాజిక వర్గంగా పేరొందిన కాపులను బీసీల జాబితాలో చేర్చే విషయంపై ఆమె తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఆ విషయమై ఆమె పాజిటివ్ గా తీసుకుంటే.. ఇప్పటివరకు బీసీల్లో  ఉన్న పలు కులాల మధ్య చిచ్చు పెట్టిన వాళ్లు అవుతారు. ఎందుకంటే..బీసీల్లోకి కనుక కాపుల్ని చేర్చిన పక్షంలో.. బీసీ (ఎ), (బి), (సి) జాబితాలో ఉన్న లక్షలాది మంది ఇతర కులాల ప్రయోజనాలను గండి కొట్టిన వారు అవుతారు. ఇది కచ్ఛితంగా కులాల కుమ్ములాటలోకి దించటం ఖాయం.

    Tollywood

    Bollywood

    Kollywood