ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Tuesday, 15 October 2013

    'అత్తారింటికి..' బల ప్రదర్శనా... బుర్రుందా?

    Critics on Pawa kalyan Attarintiki Daredi Thanks meet, pawan kalyan speech in Attarintiki Daredi sucess meet, Pawan kalyan emotional at Ad thanks meet
    ప్రతి వార్తతోను ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్‌ చేయాలని చూసే మీడియా 'అత్తారింటికి దారేది' థాంక్యూ ఫంక్షన్‌ కూడా పవన్‌కళ్యాణ్‌ తన బలాన్ని చూపించడానికి చేసిన వేడుకగా అభివర్ణిస్తోంది. మూడు, నాలుగు వేల మంది మాత్రమే పట్టే శిల్పకళావేదికలో ఎవరైనా బల ప్రదర్శన చేస్తారా? ఎక్కడైనా బహిరంగ వేడుక చేసుకుని లక్షలాది మంది జనాన్ని తెచ్చినట్టయితే బల ప్రదర్శన అనుకోవచ్చు. ఇండోర్‌ ఆడిటోరియంలో జరిగిన వేడుకతో బలం చూపించాలని ఎవరు అనుకుంటారు.

    పవన్‌ కళ్యాణ్‌ తన ప్రసంగంలో పలుమార్లు తన అన్నయ్య ప్రస్తావన తెచ్చినా కానీ సదరు పుకారు వీరుల చెవులు మూసుకుపోయినట్టున్నాయి. పవన్‌కళ్యాణ్‌ అసలు చిరంజీవి ఊసే ఎత్తలేదని, కేవలం చిరంజీవికి బలం చూపించడానికే ఈ వేడుక చేశాడనీ రాస్తున్నారు. వేడుక చూసిన వారు ఎవరైనా కానీ ఇవి తప్పుడు వార్తలని ఇట్టే గ్రహిస్తారు. అయినా కించిత్‌ సిగ్గు లేకుండా, బుర్ర, బుద్ధి లేకుండా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీడియాపై నానాటికీ తగ్గిపోతున్న మర్యాద, మన్ననలు ఇలాంటి వార్తల ప్రచారం వల్ల మరింత దిగజారిపోతాయి.

    Tollywood

    Bollywood

    Kollywood