'ఢీ' చిత్రం నుంచి 'బాద్‌షా' వరకు శ్రీను వైట్ల సినిమాలన్నిట్లో బ్రహ్మానందం కీలక పాత్ర పోషించాడు. చాలాసార్లు ఫ్లాప్ లేదా యావరేజ్ అవుతాయనే సినిమాలని బ్రహ్మానందం ఒంటిచేత్తో గట్టెక్కించాడు. పెద్ద హిట్ అవడానికి తన వంతు సహకారం అందించాడు. శ్రీను వైట్ల సినిమాకి హీరో కంటే కూడా ముఖ్యమైపోయిన బ్రహ్మానందం లేకుండా అతని తదుపరి చిత్రం తెరకెక్కనుందంటే విశేషమే అనాలి. మహేష్‌తో శ్రీను వైట్ల తీస్తున్న ఆగడులో బ్రహ్మానందం ఉండడట. కొంతకాలంగా ఒకే ఫార్మేట్‌లో సినిమాలు తీస్తున్న శ్రీను వైట్ల ఆగడులో తన పంథా మార్చుకుంటున్నాడు. ఈ చిత్రంలో కామెడీకి పెద్దగా ఆస్కారం ఉండదట. దీని వల్ల బ్రహ్మానందం పాత్ర కూడా ఉండదట. మళ్లీ సినిమాలో బ్రహ్మీ ఉంటే ఎక్కువ ఆశిస్తారు కాబట్టి అసలు ఆయన పాత్ర లేకుండా శ్రీను వైట్ల ప్లాన్ చేసుకుంటున్నాడట. అయితే పోయి పోయి మహేష్‌బాబుతో సినిమా చేస్తూ ఇంత రిస్క్ అవసరమా, సేఫ్ గేమ్ ఆడకుండా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
మహేష్‌బాబు సినిమా బాగా ఆడాలంటే బ్రహ్మానందం ఉండక్కర్లేదని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విజయం రుజువు చేసింది. అయినప్పటికీ శ్రీను వైట్ల సినిమా అనే సరికి ప్రేక్షకులు బ్రహ్మానందం ఉండాలని కోరుకుంటారు. కానీ శ్రీను వైట్ల మాత్రం ఈసారి బ్రహ్మీ లేకుండానే బ్లాక్‌బస్టర్ కొట్టాలని అనుకుంటున్నాడు.