ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Tuesday, 15 October 2013

    మీడియా కే హీరో గా మారిన పవన్

    మీడియా కే హీరో గా మారిన పవన్
    పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమా పైరసీ ఉచ్చులో చిక్కుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రింట్ మరియు ఎల్ట్రానిక్ మీడియాలు ఇచ్చిన సహకారం అంతా ఇంతా కాదు. ఈ సినిమా పైరసీ బారిన పడటం తమకే నష్టం కలిగినంత భావంతో ఈ వార్తను ఒక ప్రముఖ వార్తగా రాష్ట్రం యావత్తూ తీసుకు వెళ్ళడమే కాకుండా ఆ పైరసీ మరింత వ్యాప్తి చెందకుండా తమ వంతు సహాయాన్ని సహకారాన్ని ‘అత్తారింటి’ టీంకు మీడియా సంస్థలు అందించాయి. అంతేకాదు కొన్ని ప్రాంతాల ఉద్యమాలకు చిరునామాగా పనిచేసే ఛానల్స్ కూడా ప్రాంతీయ వాదానికి అతీతంగాపవన్ కు బాసటగా నిలిచాయి.

    ఇటువంటి పరిస్థుతుల నేపధ్యంలో నిన్న హైదరాబాద్ లో జరిగిన అత్తారిల్లు థ్యాంక్స్ గివింగ్ మీట్ కు సంబంధించిన దృశ్యాలను ప్రత్యేకంగా లైవ్ ప్రోగ్రాం ద్వారా కవర్ చేయడానికి తమ ఛానల్ కు అవకాశం కలిగిస్తే అత్తారిల్లు సినిమా నిర్మాత ప్రసాద్ కు భారీ మొత్తాలను పారితోషికంగా ఇస్తానని ఆశ చూపెట్టాయట. ఈ విషయం తెలుసుకున్న పవన్ వెంటనే స్పందించి అత్తారిల్లు నిర్మాత ప్రసాద్ ను పిలిపించి అటువంటి పనులు చేయవద్దని గట్టిగా చెప్పడమే కాకుండా ఈ ప్రోగ్రాం ను కవరేజ్ చేయడానికి చిన్న ఛానల్స్ నుండి పెద్ద ఛానల్స్ వరకు ఒకేలా అవకాసం కల్పించడంతో పవర్ స్టార్ క్రేజ్ ఇప్పుడు చానల్స్ కు కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో పవన్ ప్రస్తుతం టాపిక్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమాగా మారిపోయాడు....

    Tollywood

    Bollywood

    Kollywood