ఇంట్లో కూర్చొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో కేవలం ఒకే ఒక్క యాప్ ద్వారా నెలకు 60000 పైనే సంపాదించుకోండి. ఇది 100% జెన్యూన్..Click Here
  • Breaking News

    Thursday, 10 October 2013

    తెలంగాణకే సిఎం బౌండ్

    తెలంగాణకే సిఎం బౌండ్
    సీమాంద్రుల కోసం సిఎం పదవి ఓలెక్కా... సీమాంద్రుల ప్రయోజనాల ముందు ఈ కుర్చీ చాలా చిన్నది అంటూ హైకమాండ్ ను సైతం అడ్డగోలుగా దులిపేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఇచ్చేందుకే కట్టుబడి ఉన్నాడట. ఇది ఎవరో చెబితే నమ్మలేం కాని ఈ విషయాన్ని ఏకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగే చెప్పడంతో అందరు అవాక్కయ్యారు. వామ్మో ముఖ్యమంత్రి కిరణ్ అసలు స్వరూపం ఇదా అంటూ కాంగ్రేసోళ్లు కూడా కంగుతిన్నారు అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

    దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని మాట్లాడడం ఇటీవల ఇది మూడో సారి, ఈసారి మాత్రం సిఎం గూబ గుయ్యిమనిపించాడు అన్న భావం వ్యక్తం అవుతోంది. ఇంతకీ ఇప్పడేమన్నాడో చూద్దాం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ కుర్చీలో కూర్చున్నది కాంగ్రెస్ నిర్ణయాలను అమలు చేసేందుకు అన్నాడు. కాంగ్రెస్ తీసుకున్న ప్రతి  నిర్ణయం అమలుకు ఆయన బౌండ్ అయ్యాడు, తెలంగాణ తీర్మాణం కూడా ఆయన అసెంబ్లీలో పాస్ చేయిస్తాడు అని అంటూనే  ఆ వెంటనే ఈ స్టార్ బ్యాట్స్ మెన్ క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ దారి పడతాడు అనే అర్థం వచ్చేలా కామెంట్ చేసాడట దిగ్విజయ్.

    దీనికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికూడా తీవ్రంగానే స్పందించాడని సమాచారం. దిగ్విజయ్ చేసిన ఈ వాఖ్యలపై సిఎం రెండు పేజీల నోట్ తయారు చేసి పంపించాడట. కాంగ్రెస్ మాటకు, నిర్ణయానికి నేను బౌండ్ అయ్యానని మీకు తెలుసుకదా... ఇంకా నావిషయంలో అపోహలెందుకు, ఇప్పటికిది మూడోసారి నాగురించి కామెంట్ చేయడం అంటూ ఆన్సర్ ఇచ్చాడని తెలిసింది. సరే ఈఇద్దరి ఆరోపణలు, ప్రత్యారోపణల మాట ఎలా ఉన్నా కూడా ముఖ్యమంత్రి అంత పనిచేస్తాడు అన్న అపోహలయితే ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు దిగ్విజయ్ మాటలతో మరింత బలపడ్డాయి అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

    Tollywood

    Bollywood

    Kollywood